Posts
See what everyone’s up to and what’s on their minds
Posts
-
-
-
గత ప్రభుత్వంలో ఏయూని వైసీపీ కార్యాలయంగా మార్చేశారు
ఆంధ్రా యూనివర్సిటీ 2019లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో 29 ఉండేది. 2023నాటికి 76వ ర్యాంక్‌కు పడిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక 41వ ర్యాంకుకు తెచ్చాం. ఇప్పుడు టాప్ -10లోకి తేవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. యూనివర్సిటీ కేటగిరిలో 2019లో 16వ ర్యాంకులో ఉండగా, 2023నాటికి 43వ ర్యాంకుకు పడిపోయింది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2025లో 23వ ర్యాంకుకు తెచ్చాం.
#APAssembly
#NaraLokesh
#AndhraPradesh4 Views 830 Views -
[27/02, 12:57 pm]
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు: కేజ్రీవాల్, సిసోడియాకు క్లీన్ చిట్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు కీలక ఊరట లభించింది. ఈ కేసులో కేజ్రీవాల్‌తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియాను కూడా రౌస్ అవెన్యూ కోర్టు డిశ్చార్జ్ చేసింది.
సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో మెరిట్ లేదని కోర్టు వ్యాఖ్యానించినట్లు సమాచారం. అభియోగాలను నిర్ధారించే విధంగా ఎలాంటి పక్కా ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్, సిసోడియాలకు క్లీన్ చిట్ ఇస్తూ డిశ్చార్జ్ ఆదేశాలు జారీ చేసింది.
ఈ తీర్పుతో ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు విచారణలో వచ్చిన ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
[27/02, 12:59 pm]
: “నిజం గెలిచింది.. రాజకీయ కుట్రే”: కవిత వ్యాఖ్యలు
హైదరాబాద్, ఫిబ్రవరి 27: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు నుంచి బయటకు వచ్చిన అనంతరం బీఆర్‌ఎస్ నేత కల్వకుంట్ల కవిత భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. “నిజం గెలిచింది.. కడిగిన ముత్యంలా బయటకు వచ్చాను” అని తెలిపారు.
తనపై పెట్టిన కేసు పూర్తిగా రాజకీయ కుట్రేనని కవిత ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీని, ముఖ్యంగా మాజీ సీఎం కే. చంద్రశేఖర్ రావును టార్గెట్ చేయడానికే ఈ కేసు పెట్టారని పేర్కొన్నారు. “మూడేళ్ల పాటు నానా మాటలు అన్నారు.. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. కానీ చివరకు నిజం వెలుగులోకి వచ్చింది” అని అన్నారు.
ఈ సందర్భంగా తన తల్లిదండ్రులు, అత్తామామలు కష్టకాలంలో అండగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు. “నాకు అండగా నిలిచిన వారిని ఎప్పటికీ మరిచిపోను” అని కవిత స్పష్టం చేశారు.
కేసు పరిణామాల నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.54 Views -
సీఎం చంద్రబాబు గారి ఆదేశాలతో రాష్ట్రమంతా యుద్ధ ప్రాతిపదికన రోడ్లు వేస్తున్నారు. దీనిలో భాగంగా అనకాపల్లి - చోడవరం రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి.
#ChandrababuNaidu
#AndhraPradesh5 Views 492 Views -
• రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టులన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలోనివే, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ దశలవారీగా పూర్తి చేస్తాం ..అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో సీఎం చంద్రబాబు
• కల్తీ నెయ్యి పై చర్చకు వైసీపీ సభ్యులు ఎందుకు భయపడుతున్నారు? శాసనమండలిలో మార్చి 4న లఘు చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ..మంత్రి పయ్యావుల కేశవ్
• ఘటన జరిగాక కాదు, ముందే మేల్కొనాలి ..అతిసార,కల్తీపాల ఘటనలపై జిల్లా కలెక్టర్లు, అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు
• 2027 గోదావరి పుష్కరాలను ఆరు జిల్లాల్లో మహా కుంభమేళా తరహాలో నిర్వహించేందుకు 373 ఘాట్లు ఏర్పాటు. గోదావరి పుష్కరాలు పై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో పాల్గొన్న ఎనిమిది మంది మంత్రులు
• రాష్ట్రంలోని గ్రామ ,వార్డు సచివాలయాలకు "స్వర్ణ గ్రామం ", "స్వర్ణ వార్డు" గా పేర్ల మార్పు . మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించిన ఏపీ అసెంబ్లీ.874 Views -
ప్రస్తుతం రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా 943 సేవలు అందిస్తున్నాం. ఇప్పటివరకు ఈ యాప్ ద్వారా 1.48 కోట్ల సేవలు అందించాం.
#APAssembly
#ManaMitra
#WhatsAPPGovernanceInAP
#NaraLokesh
#AndhraPradesh7 Views 1.6K Views -
-
-
తెలంగాణ సచివాలయం వద్ద కీలక భేటీ
హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మావోయిస్టు అగ్రనేతలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నట్లు సమాచారం.
భేటీకి హాజరుకానున్న వారు
దేవ్‌జీ
మల్లా రాజిరెడ్డి
చంద్రన్న
సుజాతక్క
దామోదర్
నూనె నరసింహారెడ్డి
ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారుడు కే. కేశవరావు (కేకే) కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
భద్రతా పరిస్థితులపై చర్చ?
సమావేశానికి ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి మరియు ఐజీ సుమతితో భేటీ కానున్నారు. భద్రతా ఏర్పాట్లు, చర్చల అజెండా వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.
రాజకీయంగా ప్రాధాన్యం
మావోయిస్టు అగ్రనేతలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష చర్చలు జరపడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. శాంతి చర్చలు, లొంగుబాటు విధానం లేదా అభివృద్ధి అంశాలపై చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక ఈ భేటీపై అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సి ఉంది.48 Views