Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మదనపల్లిలో లారీ ఢీకొని బొలెరో డ్రైవర్ కోమాలోకి.
    అన్నమయ్య జిల్లాలో శుక్రవారం వేకువజామున మదనపల్లి – నిమ్మనపల్లి మార్గంలోని బసినికొండ నాలుగు రోడ్ల కూడలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన లారీ, బొలెరో వాహనాన్ని ఢీకొనడంతో బొలెరో డ్రైవర్ తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు వెంటనే బాధితుడిని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని...
    281 Views
  • కురబలకోటలో రైతు చేతులు విరిచి హత్యాయత్నం.
    కురబలకోట మండలం తుమ్మచెట్లపల్లి గ్రామంలో భూ తగాదాల నేపథ్యంలో రైతు జరిపిటి సురేంద్ర (59)పై అదే గ్రామానికి చెందిన రమణ, మహేశ్, మహేంద్ర వర్గీయులు గురువారం అర్ధరాత్రి కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో సురేంద్రకు తీవ్ర గాయాలై, రెండు చేతులు విరిగినట్లు వైద్యులు తెలిపారు. స్థానికులు అతన్ని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
    278 Views
  • అన్నమయ్య జిల్లా డీపీఎంఓగా డాక్టర్ రమేష్ బాబు నియామకం.
    అన్నమయ్య జిల్లా డీపీఎంఓగా మదనపల్లికి చెందిన డాక్టర్ రమేష్ బాబును నియమిస్తూ డీఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీ నరసయ్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓగా పనిచేస్తున్న డాక్టర్ రమేష్ బాబుకు డీఎంహెచ్ఓ అదనపు బాధ్యతలు అప్పగించారు. డీపీఎంఓగా స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను వేగవంతం చేస్తానని డాక్టర్ రమేష్ బాబు తెలిపారు
    285 Views
  • మదనపల్లెలో ఏసీబీ దాడులు – రికార్డుల పరిశీలన.
    మదనపల్లెలో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కడప రిమ్స్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ మేజారి సుబ్బయ్య సదరం సర్టిఫికెట్ల జారీలో బాధితుడి నుంచి రూ. 30 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు, ఆదాయానికి మించిన ఆస్తులు లభించలేదని తెలిపారు. కుటుంబ సభ్యుల సమాచారంతో నివేదికలు సిద్ధం చేసి...
    417 Views
  • అన్నమయ్యజిల్లా సర్వేలెన్స్ అధికారిగా డాక్టర్ శ్రీధర్ నియామకం.
    అన్నమయ్య జిల్లా సర్వేలెన్స్ అధికారిగా, మదనపల్లి పీపీ యూనిట్ ఇన్‌చార్జిగా డాక్టర్ శ్రీధర్‌ను నియమిస్తూ డీఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీనరసయ్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం ద్వారా జిల్లాలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, అతిసార వంటి వ్యాధుల కేసులకు సంబంధించిన డేటాను సర్వేలెన్స్ బృందం సేకరించి, ప్రభుత్వానికి నివేదికలు పంపనుంది. ఈ సమాచారం వ్యాధుల నియంత్రణకు, ప్రజారోగ్య పరిరక్షణకు...
    298 Views
  • మదనపల్లి: స్కూటర్ ఢీకొని రైతుకు తీవ్ర గాయాలు.
    గురువారం రాత్రి మదనపల్లి మండలం చీకిల బైలులో రోడ్డు దాటుతున్న గురికాని నారాయణస్వామి (55)ని ఓ స్కూటర్ వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తులు వెంటనే స్పందించి నారాయణస్వామిని మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు చికిత్స అందించగా, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని తెలిపారు.
    305 Views
  • మదనపల్లెలో భూ మ్యుటేషన్లపై శిక్షణా కార్యక్రమం.
    అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గురువారం మదనపల్లెలో రెవెన్యూ సిబ్బందికి భూ మ్యుటేషన్లపై శిక్షణ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో నాణ్యతతో మ్యుటేషన్లు పరిష్కరించడం, ఆన్‌లైన్ (Webland) వినియోగం, పట్టాదారు పాస్ పుస్తకాల తప్పుల సవరణ, రీ-సర్వేలో జాయింట్ ఎల్పీఎంల తగ్గింపు, భూ రికార్డుల పారదర్శకత పెంపు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
    318 Views
  • నిమ్మనపల్లి కేజీబీవీ పాఠశాల‌ను డీఈవో ఆకస్మిక తనిఖీ.
    అన్నమయ్య జిల్లా డీఈవో సుబ్రహ్మణ్యం గురువారం నిమ్మనపల్లె కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థుల వీడ్కోలు సమావేశంలో పాల్గొని, పాఠశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను పరిశీలించి, డీఈవో హర్షం వ్యక్తం చేశారు.
    247 Views
  • బోయకొండలో రహస్య కోడిపందెం; 13 మందిని అరెస్ట్.
    అన్నమయ్య జిల్లా బోయకొండ పరిసరాల్లోని వీకే రెసిడెన్సీ వెనుక రహస్యంగా నిర్వహిస్తున్న కోడిపందెంపై డీఎస్పీ మహేంద్ర నేతృత్వంలోని ప్రత్యేక బృందం గురువారం దాడి చేసింది. డ్రోన్ కెమెరా సహాయంతో పందెం ఆడుతున్న 13 మందిని గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఆరు కోళ్లు, రూ. 25,000 నగదు, 11 వాహనాలు, 13 ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నాగేశ్వరరావు తెలిపా.
    271 Views
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీకి తూట్లు పొడిచారు: షర్మిల.
    కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం అన్నమయ్య జిల్లాలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా కూలీలతో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి తూట్లు పొడుస్తున్నాయని ఆమె ఆరోపించారు. ఈ పథకం పేరుతోనే కొనసాగాలని ఆమె డిమాండ్ చేశారు. గురువారం పుంగనూరులో పర్యటిస్తానని తెలిపారు.
    279 Views