Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పుంగనూరు: ప్రారంభమైన మసెమ్మ జాతర
    పుంగనూరు మండలం, కొండచర్ల గ్రామంలో ప్రతిష్టాత్మకంగా జరిగే మసెమ్మ జాతర ఆదివారం ప్రారంభమైంది. సుమారు 159 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరలో 30 గ్రామాల ప్రజలు పాల్గొంటారు. కోరికలు తీర్చే అమ్మగా పేరుగాంచిన మసెమ్మను దర్శించుకోవడానికి ఉమ్మడి, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. జాతరకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు#...
    353 Views
  • పేదల సేవలో భాగంగా ఈరోజు దర్శి మండలం, జముకులదిన్నె పంచాయతీలో ముందస్తుగా “ఎన్టీఆర్ భరోసా పెన్షన్” కార్యక్రమం నిర్వహించి లబ్ధిదారులకు ఇంటి వద్దకే పెన్షన్లు అందజేశారు
    పేదల సేవలో భాగంగా ఈరోజు దర్శి మండలం, జముకులదిన్నె పంచాయతీలో ముందస్తుగా “ఎన్టీఆర్ భరోసా పెన్షన్” కార్యక్రమం నిర్వహించి,లబ్ధిదారులకు ఇంటి వద్దకే పెన్షన్లు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారి ఆధ్వర్యంలోమాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు గారు, టిడిపి యువ నాయకులు డా. కడియాల లలిత్ సాగర్ గారు, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి –...
    380 Views
  • మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష జన్మదిన వేడుకలు ఘనంగా.
    రామసముద్రం మండల కేంద్రంలోని చెక్‌పోస్ట్ కూడలిలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష జన్మదిన వేడుకలను మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాణాసంచాలు పేల్చి కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఎమ్మెల్యేకు దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం కలగాలని నాయకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని సందడి చేశారు.
    302 Views
  • మదనపల్లి: పేకాట స్థావరంపై పోలీసుల దాడులు – ముగ్గురు అరెస్ట్.
    మదనపల్లి తాలూకాలోని వేంపల్లి గ్రామం మల్లయ్య కొండ సమీపంలో పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు శనివారం మెరుపు దాడి నిర్వహించారు. తాలూకా సీఐ కళా వెంకటరమణ, ఎస్‌ఐ చంద్రమోహన్ నేతృత్వంలో జరిగిన ఈ దాడుల్లో 9 మంది పరారవ్వగా, వారిలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 8,200 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
    271 Views
  • చౌడేపల్లి లో వాస్మోల్ తాగి యువతి ఆత్మహత్యాయత్నం.
    అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలానికి చెందిన భవన కార్మికుడు మునీశ్వర్, రోజూ సంపాదించిన కూలీ డబ్బును మద్యం కోసం ఖర్చు చేస్తున్నాడు. దీంతో కుటుంబ పోషణ భారమై, పిల్లలతో కలిసి పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఈ మనోవేదనతో భార్య సుకన్య వాస్మోల్ పాయిజన్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. శనివారం జరిగిన ఈ ఘటనపై బాధితురాలు వివరాలు వెల్లడించింది.
    300 Views
  • చౌడేపల్లి మండలంలో ఆటో బోల్తా – ఐదుగురికి గాయాలు.
    శనివారం అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలంలో ఆటో బోల్తా పడి ఐదుగురు గాయపడ్డారు. సొంత పనిపై చౌడేపల్లికి వచ్చిన రెడ్డప్ప, లక్ష్మమ్మ, మరో ముగ్గురు ఆటోలో స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా, పరికితున్న మలుపు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడగా, రెడ్డప్ప, లక్ష్మమ్మలకు తీవ్ర గాయాలవడంతో వారిని మదనపల్లి ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
    268 Views
  • నల్ల వీర గంగభవాని జాతర: భక్తులకు సర్పంచ్ పిలుపు.
    మదనపల్లె సి.టి.యం గ్రామంలో ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు జరగనున్న శ్రీ నల్ల వీర గంగభవాని జాతరను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రుల కావాలని గ్రామ సర్పంచ్ ఆనంద పార్ధసారథి ఆదివారం పిలుపునిచ్చారు. ప్రత్యేక పూజలు, ఉత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ పెద్దలు తెలిపారు.
    279 Views
  • రహదారులపై భద్రతే ప్రజల జీవితాలకు రక్ష: జిల్లా కలెక్టర్
    మదనపల్లి బైపాస్ రోడ్డులోని పీపీఆర్ ఫంక్షన్ హాల్‌లో రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు సభలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు. రహదారి భద్రత ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన అన్నారు. హిట్ అండ్ రన్ ప్రమాదాల్లో మృతి చెందితే రూ. 2 లక్షలు, గాయపడితే రూ. 50 వేలు పరిహారం అందిస్తామని, గోల్డెన్ అవర్‌లో బాధితులను ఆసుపత్రికి చేర్చిన వారికి రూ. 25 వేలు...
    285 Views
  • ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేసిన కలెక్టర్.
    మదనపల్లి మండలం కొండామర్రిపల్లిలో శనివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు. బయోమెట్రిక్ విధానంలో లబ్ధిదారుల ఇంటి వద్దనే వేలిముద్ర తీసుకుని నగదు అందిస్తున్న విధానాన్ని ఆయన పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి పింఛన్ సకాలంలో అందుతోందా అని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో తాగునీటి సమస్యలపై కూడా విచారణ చేసి, సురక్షిత నీరు అందేలా చర్యలు...
    259 Views
  • పుల్లలచెరువు మండలం యండ్రపల్లి గ్రామంలో ప్రభుత్వ హోమియో వైద్యశాల నూతన భవన నిర్మాణ శంకుస్థాపన
    పుల్లలచెరువు మండలం యండ్రపల్లి గ్రామంలో ప్రభుత్వ హోమియో వైద్యశాల నూతన భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు, AMC చైర్మన్ చేకూరి సుబ్బారావు, యండ్రపల్లి సర్పంచ్ తాళ్లపల్లి సుబ్బారావు వెంకట లక్ష్మి నరసమ్మ గార్లు, పుల్లల చెరువు మండల అధ్యక్షులు పొట్ల గోవిందు గారు, యర్రగొండపాలెం మండల అధ్యక్షులు చిట్యాల వెంగళ...
    367 Views