5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం......

0
443

వేటపాలెం: 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి మహాత్మా జ్యోతిబాఫూలే వెనుకబడిన వర్గాల గురుకుల పాఠశాలల్లో 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 4వ తేదీ తుది గడువుగా నిర్ణయించినట్లు వేటపాలెం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మహ్మద్ నహీదా  ఒక ప్రకటనలో తెలిపారు.
వేటపాలెం కేంద్రంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నిర్వహిస్తున్న జ్యోతిబాఫూలే బీసీ గురుకుల బాలుర పాఠశాలలు వేటపాలెం, యర్రగొండపాలెం, కొండేపి ప్రాంతాల్లో ఉండగా, బాలికల పాఠశాలలు టంగుటూరు, మార్కాపురం, కనిగిరి ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు 04-03-2026 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు.
పరీక్షకు హాజరు కాని విద్యార్థులకు ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు. మొత్తం 6 గురుకులb పాఠశాలల్లో 5వ తరగతికి 380 ఖాళీలు, అలాగే 6, 7, 8 తరగతుల్లో బ్యాక్లాగ్ ఖాళీలు 260 ఉన్నట్లు తెలిపారు.
ప్రవేశాల కోసం నిర్వహించే పోటీ పరీక్ష ఏప్రిల్ నెలలో మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, వేటపాలెం నందు జరుగుతుందని వెల్లడించారు. మరిన్ని వివరాలకు.

 

#Narendra

Search
Categories
Read More
Uttarkhand
Uttarakhand Mulls Reopening Nanda Devi Peak After 42-Year Ban
After four decades, Uttarakhand is exploring the possibility of reopening Nanda Devi (7,816 m)...
By Bharat Aawaz 2025-07-17 07:33:09 0 1K
Telangana
అంబేద్కర్ గౌరవాన్ని కించపరిస్తే సహించేది లేదు ఆసిఫాబాద్ సెంటర్ కమిటీ
• ఈ నెల 17న శాంతియుత ర్యాలీ • ఆసిఫాబాద్ సీఐకి వినతిపత్రం అందజేత 🎤ఆసిఫాబాద్ భారత్...
By Chunarkar Jagadeesh 2026-09-15 13:37:59 0 89
SURAKSHA
Drug-Free Campaign: Empowering Our Youth
​The Drug-Free Campaign is a critical, proactive initiative dedicated to shielding youth from the...
By Kalaga Sailaja 2026-06-26 12:22:49 0 245
Telangana
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ శ్రీ దుదిల్ల శ్రీపాదరావు వర్ధంతి.
 శాసనసభ మాజీ స్పీకర్ దివంగత నేత  శ్రీపాద రావు వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి నా ఘన...
By Thalakokkula Sadanandam 2026-04-13 05:52:06 0 611
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com