విద్యతోనే మెరుగైన సమాజం

0
214

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు.

 

-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.

 

ఘనంగా ఎల్బీఆర్సిఈ వార్షికోత్సవ వేడుకలు.

 

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 07.02.2026.

 

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని, కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు.

 

మైలవరం పట్టణంలోని లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల (ఎల్బీఆర్సిఈ) వార్షికోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్, కో ఫౌండర్ లకిరెడ్డి జయప్రకాష్ రెడ్డి గారు, తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలకు శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ కళాశాల వ్యవస్థాపకులు దివంగత లకిరెడ్డి బాలిరెడ్డి గారు అమెరికా వెళ్లి శ్రమించి అంచెలంచెలుగా ఎదిగారని పేర్కొన్నారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన బాలిరెడ్డి గారు మాతృభూమిని మరువకుండా ఆయన స్వగ్రామమైన వెల్వడంకు చేసిన సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. మైలవరం ప్రాంతంపై మమకారంతో ఇక్కడ లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలను నెలకొల్పి స్థానికంగా ఉన్నత విద్యాభివృద్ధికి కృషి చేశారన్నారు.

 

ఎల్బీఆర్సిఈలో చదువుకునే ప్రతి విద్యార్థి వారి ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రయోజకులుగా ఎదగాలన్నారు. భారతీయ విద్యార్థులు ప్రపంచ దేశాలతో పోటీ పడాలన్నారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ప్రతి ఒక్కరూ ప్రపంచంలో అత్యుత్తమ మానవ వనరులుగా మారిన భారతీయుల్లో మన ఎల్బీఆర్సీఈ విద్యార్థిని, విద్యార్థులు కూడా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అక్షయ తృతీయ రోజున మహిళలకు శుభవార్త
*అక్షయ తృతీయ ముందు మహిళలకు శుభవార్త*   - భారీగ తగ్గిన బంగారం ధరలు - 24 క్యారెట్ల బంగారం...
By Rajini Kumari 2026-04-17 15:57:39 0 144
Telangana
Citizen Rights & Corporate Accountability
In Wake of Sigachi Blast: Citizen Rights, Safety & Corporate Duty The devastating reactor...
By Citizen Rights Council 2025-07-01 05:55:28 0 2K
Andhra Pradesh
పశ్చిమ వాడవాడల్లో జగనన్న జన్మదిన వేడుకలు
విజయవాడ 21-12-2025   ప్రచురణార్ధం   *పశ్చిమలో వాడ వాడ ల జగనన్న జన్మదిన వేడుకలు*...
By Rajini Kumari 2025-12-21 12:20:53 0 261
SURAKSHA
Guardian of Justice: The Inspiring Journey of IPS Jatin Narwal
Integrity, Empathy, and Decisive Leadership at the Forefront of Indian Policing In the demanding...
By Kalaga Sailaja 2026-07-28 09:53:36 0 170
Telangana
మార్చి నేలపై మీమ్స్ ఒక నెలలో ఇన్ని మార్పుల
జనవరి ఫిబ్రవరి నెలలు చిటికెలో గడిచిపోగా . మార్చి నేల మాత్రం నత్తనడకలా సాగుతుందని నెటింట మీమ్స్...
By MERIGE MALLESH 2026-03-27 12:50:16 0 405
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com