S.F.S స్కూల్ రోడ్డు సమస్యపై 24 గంటల్లోనే పరిష్కారం తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
Posted 2026-02-03 16:14:46
0
394
పర్చూరు: పర్చూరు మండలం నాగులపాలెం గ్రామంలో S.F.S స్కూల్ మెయిన్ రోడ్డును కొత్తగా నిర్మించిన హైవే కారణంగా వినియోగించకపోవడంతో, ఆ ప్రాంతం పూర్తిగా చెత్తకుప్పగా మారింది. రోడ్డు మీదే మల–మూత్ర విసర్జనలు జరుగుతుండటంతో ఆ ప్రాంతం దుర్గంధంతో డంపింగ్ యార్డ్‌ను తలపించే పరిస్థితి ఏర్పడింది.ఈ రహదారిని ప్రతిరోజూ S.F.S స్కూల్‌కు వెళ్లే చిన్నారులు నడక మార్గంగా వినియోగించాల్సి రావడంతో, చెత్త మురికి, దుర్వాసన కారణంగా పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోవడంతో, చివరకు ఈ అంశాన్ని సోషల్ మీడియా ద్వారా గౌరవనీయులైన ఎమ్మెల్యే శ్రీ ఏలూరి సాంబశివరావు గారి దృష్టికి తీసుకువచ్చారు.సమస్య తీవ్రతను గమనించిన వెంటనే ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారు తక్షణమే స్పందించి, అధికారులను ఆదేశించి యుద్ధ ప్రాతిపదికన శుభ్రత పనులు చేపట్టించారు. చెత్త తొలగింపు, పరిసరాల శుభ్రత, పిల్లలకు ఆటంకం కలగకుండా రోడ్డు సర్దుబాటు వంటి చర్యలు తీసుకుని 24 గంటల్లోనే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు.
ప్రజల సమస్యలపై ఆలస్యం చేయకుండా వెంటనే స్పందిస్తూ, ముఖ్యంగా చిన్నారుల భద్రత, ఆరోగ్యాన్ని ప్రథమ ప్రాధాన్యంగా తీసుకునే ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారి నాయకత్వానికి ఇది మరో నిదర్శనం.
ఈ సమస్యను సత్వరమే పరిష్కరించినందుకు పిల్లల తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం మరియు గ్రామ ప్రజలు ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Sanjay Kumar Agarwal: Steering Bihar Towards Progress
The Journey Begins
"The true strength of governance lies not in authority, but in delivering...
పుంగనూరు:చౌడేపల్లి మండలంలో అగ్నిప్రమాదం జరిగింది.
బుధవారం సాయంత్రం పుంగనూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలోని చౌడేపల్లి మండలం, చుక్క వారి పల్లి గ్రామంలో...
ప్రతి హజ్ యాత్రికుడికి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే మా లక్ష్యం
హజ్ యాత్రికులకు ఘనంగా వీడ్కోలు
హజ్ కమిటీ ఛైర్మన్ కృతజ్ఞతా పూర్వక అభినందనలు
ప్రతి హజ్...
విజయవాడ కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఘోర రోడ్డు ప్రమాదం
కృష్ణాజిల్లా.
పెనమలూరు నియోజకవర్గం..
ఉయ్యూరు..
బ్రేకింగ్.. స్క్రోలింగ్. ...
ప్రాంతీయ ఉప సంచాలకులు ఆకస్మిక తనిఖీ
విశాఖ పట్నం జిల్లా భీమిలి ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణం లో ఉన్న ఆయుష్ శాఖ ఆసుపత్రిలో సుమారు 30 లక్షల...