పోలీసులతో జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రతిజ్ఞ చేయించిన అడిషనల్ ఎస్పీ :

0
173

కర్నూలు సిటీ :
కర్నూలు జిల్లా....

జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బందిచే జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రతిజ్ఞ ...

జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని కర్నూలు ఎస్పీ శ్రీ  విక్రాంత్ పాటిల్ ఐపియస్  గారి ఆదేశాల మేరకు ఎఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణమోహన్ గారు జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి  జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఎ ఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణ మోహన్ గారు  మాట్లాడుతూ...

ఓటరే ప్రజాస్వామ్య శక్తి అని, దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఓటు మాత్రమేనన్నారు. 

18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఓటు నమోదు చేసుకోవాలన్నారు. 

ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. 

ఓటు వినియోగం ప్రతి ఒక్కరి బాధ్యత అని, మంచి సమాజ స్థాపనకు ఓటే కీలకమన్నారు.

ఈ క్రింది విధంగా ఎఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణమోహన్ గారు  జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. 

 “భారతదేశ పౌరుడినైన నేను ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయిత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని మతం, జాతి, ప్రాంతం, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తానని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను” 

ఈ కార్యక్రమంలో ఆర్ఐ లు నారాయణ, జావేద్, ఆర్ ఎస్సైలు,  సివిల్, ఎఆర్, జిల్లా పోలీసు కార్యాలయ మినిస్టిరియల్ సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Bihar
Bihar Strengthens Women and Child Welfare Initiatives
Bihar continues to expand women and child welfare initiatives through programs focused on...
By Fathima Safa 2026-07-03 14:47:21 0 36
Business & Finance
VLE Registration Process for Digital Service Providers
VLE (Village Level Entrepreneur) Registration enables individuals to become authorized service...
By Navya Sree 2026-07-24 05:07:12 0 16
Andhra Pradesh
ప్రభుత్వ సేవలు ప్రజలకు సజావుగా అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్
ప్రభుత్వ సేవలు ప్రజలకు సజావుగా అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్...
By Gadiyapudi Narendra 2026-01-09 09:57:30 0 264
Business & Finance
Drive Your Dreams with the Right Vehicle Loan
A vehicle loan helps you purchase a new or used car, bike, or commercial vehicle without...
By Navya Sree 2026-07-20 06:39:53 0 34
Andhra Pradesh
జనసేన సిద్ధాంతాలను నడిచినవారితో సంస్థాగత నిర్మాణం
జనసేన సిద్ధాంతాలను విశ్వసించే నడిచినవారితో సంస్థాగత నిర్మాణం  జనసేన అనేది నిరంతర ప్రవాహంలా...
By Chennaiah Kati 2026-06-28 06:31:15 0 55
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com