అందరికీ సకల శుభాలు కలగాలి మంత్రి ఆనం

0
239

*తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి : మంత్రి ఆనం*

 

*అందరికీ సకల శుభాలు కలగాలి*

 

*రాష్ట్ర ప్రజలందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి*.

 

నెల్లూరు, జనవరి 13: తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన సంక్రాంతి పండుగను రాష్ట్ర ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి సకల శుభాలు అందించాలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి ఆకాంక్షించారు. 

 

భోగి, మకర సంక్రాంతి, కనుమ పర్వదినాలను పురస్కరించుకుని మంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్థిల్లాలని, రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి అన్నదాతలు పాడి పంటలు,బోగ భాగ్యాలు,సిరి సంపదలతో తుల తూగాలని, అందరి కుటుంబాలలో ఆనందం వెల్లి విరియాలని రాష్ట్రం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. 

 

ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న మంత్రి, ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలందరిపై, రాష్ట్రాన్ని సుపరిపాలన వైపు నడిపిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పై, రాష్ట్ర ప్రభుత్వంపై ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు-

 

Search
Categories
Read More
Telangana
దంచికొట్టనున్న ఎండలు.. జాగ్రత్త
ఈవారం ఎండలు దంచికొడతాయని, మార్చి 3 నుంచి 7 వరకు ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ...
By Boiena Rajesh 2026-03-01 09:10:24 0 219
Andhra Pradesh
మదనపల్లి లో ప్రభుత్వ ఉద్యోగి పై దాడి.
శుక్రవారం మదనపల్లెలో ప్రభుత్వ ఉద్యోగి జగదీష్ నాయక్ (26) పై దాడి జరిగింది. విధులు ముగించుకుని...
By Pagadala Venkateswar 2026-01-31 05:42:01 0 183
Andhra Pradesh
సరైన సమయంలో వైద్య సేవలు అందక గిరిజన యువత మృతి!
చింతూరు డివిజన్ ఏజెన్సీ మారుమూల గిరిజన ప్రాంతం కర్మన్ కొండ లో గత మూడురోజుల క్రితం పాముకాటుకు...
By Shyamala Yadagiri 2026-07-09 17:42:03 0 191
Andhra Pradesh
మదనపల్లిలో జువెలరీస్ మోసం: కేసు నమోదు.
మదనపల్లెలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న మణప్పురం రితు జువెలరీస్‌లో జరిగిన మోసంపై పోలీసులు...
By Pagadala Venkateswar 2026-04-03 05:37:25 0 181
Andhra Pradesh
మదనపల్లిలో దివ్యాంగులకు ఉచిత వైద్య శిబిరం.
మదనపల్లి పట్టణంలోని ఎంఎల్ఎల్ హాస్పిటల్ లో గురువారం దివ్యాంగుల కోసం ఉచిత వైద్య శిబిరం...
By Pagadala Venkateswar 2026-02-13 06:42:01 0 206
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com