వక్ఫ్ బోర్డు చైర్మన్‌కు వినతిపత్రం అందజేసిన ముస్లిం సంఘాల నాయకులు అబ్దుల్ కలాం, నాగుల్ మీరా, నూర్ ఖాన్.

0
216

అంజుమన్-ఎ-ఇస్లామియా, గుంటూరు సంస్థకు చెందిన నోటిఫై చేసిన వక్ఫ్ భూములను ఇండస్ట్రియల్ పార్క్ పేరిట భూ సేకరణ చేయాలనే ప్రయత్నాలను నిలిపివేయాలని కోరుతూ గుంటూరు జిల్లాకు చెందిన వివిధ ముస్లిం సంఘాల నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చిన్నకాకాని గ్రామ పరిధిలో ఉన్న సుమారు 71.57 ఎకరాల భూములు 1962 వక్ఫ్ గెజిట్‌లో నోటిఫై అయిన వక్ఫ్ భూములని, ఇవి అంజుమన్-ఎ-ఇస్లామియా సంస్థ ఆధ్వర్యంలో మత, విద్యా మరియు దాతృత్వ కార్యక్రమాలకు ఉపయోగపడుతున్నాయని వివరించారు. ఈ భూముల నుంచి వచ్చే ఆదాయంతో పేద మరియు అర్హులైన విద్యార్థులకు విద్య అందిస్తున్నామని తెలిపారు.

వక్ఫ్ బోర్డు ఇప్పటికే ఈ భూములు ల్యాండ్ అక్విజిషన్‌కు ఇవ్వడానికి కుదరదని స్పష్టంగా చెప్పినప్పటికీ, సంబంధిత ప్రభుత్వ శాఖలు బలవంతంగా భూ సేకరణ ప్రక్రియ కొనసాగించడం వక్ఫ్ చట్టానికి పూర్తిగా విరుద్ధమని వారు ఆరోపించారు. వక్ఫ్ బోర్డు తీసుకున్న తీర్మానాలు మరియు సీఈఓ అధికారిక లేఖలు ఉన్నా కూడా వాటిని పక్కనపెట్టి ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తుండటం అన్యాయమని అన్నారు.

ఈ పరిస్థితుల్లో వక్ఫ్ భూములను రక్షించేందుకు వక్ఫ్ బోర్డు తరఫున గౌరవ హైకోర్టు లేదా గౌరవ వక్ఫ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి న్యాయపోరాటం చేయాలని వారు చైర్మన్‌ను కోరారు. వక్ఫ్ భూములు అల్లాహ్ ఆస్తులని, వాటిని కాపాడటం వక్ఫ్ బోర్డు యొక్క చట్టబద్ధ బాధ్యత మాత్రమే కాకుండా మతపరమైన అమానత్ కూడా అని నాయకులు స్పష్టం చేశారు.

ఈ భూ సేకరణ జరిగితే వక్ఫ్ సంస్థ నిర్వీర్యమై, ముస్లిం సమాజానికి అపరిహార నష్టం జరుగుతుందని వారు హెచ్చరించారు. అందుకే ఈ అంశంపై తక్షణమే స్పష్టమైన చర్యలు తీసుకుని భూ సేకరణను పూర్తిగా నిలిపివేయాలని వక్ఫ్ బోర్డును వారు డిమాండ్ చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎమ్మిగనూరు పట్టణం లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది.
భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు...
By Boya Dasthagiri 2026-04-14 08:58:54 0 185
Andhra Pradesh
పోలేరమ్మ తిరునాళ్లలో ‘శక్తి టీం’ మానవత్వం - తప్పిపోయిన చిన్నారులు తల్లిదండ్రుల చెంతకు..
చీరాల మండలం తోటవారిపాలెంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్లలో...
By Vadlamudi NagaVenkat 2026-05-06 01:52:33 0 263
Telangana
శ్రీరాంపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 31వ డివిజన్ శ్రీరాంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో...
By Avunoori Mahesh 2026-09-08 07:36:11 0 132
Telangana
ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద నిర్లక్ష్యాన్ని సహించేది లేదు....!
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు: CM రేవంత్ రెడ్డి భారత్ అవాజ్ న్యూస్:12 మే...
By Gujile Ramu 2026-05-12 08:22:34 0 142
Andhra Pradesh
పుంగనూరు: ఘాట్ రోడ్లో పల్టీలు కొట్టిన కారు
పులిచెర్ల మండలంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొద్దుటూరు పట్టణానికి చెందిన సరస్వతమ్మ,...
By Kothuru Murali 2026-04-16 17:11:02 0 157
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com