అర్హులందరికీ సంక్షేమం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే గళ్ళా మాధవి

0
192

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి బుధవారం 39వ డివిజన్ నేతాజీ నగర్‌లో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు.

*ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ…*

కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే ప్రతి నెలా నిర్విరామంగా, ఎలాంటి అంతరాయం లేకుండా పెన్షన్ పంపిణీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన అందజేయాల్సిన పెన్షన్లను ఈసారి ప్రజలకు మరింత సౌకర్యంగా ఉండేలా 31వ తేదీకే ముందుగానే అందజేయడం జరిగిందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. గతంలో పెన్షన్ తీసుకుంటూ మృతి చెందిన లబ్ధిదారుల పెన్షన్లను వారి భార్యలకు వితంతు పెన్షన్ లాగా మంజూరు చేయడం జరిగిందని వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ వ్యవస్థ మరింత పారదర్శకంగా, మానవీయంగా అమలు అవుతుందని తెలిపారు.

ఆర్థిక భారం ఎంత ఉన్నప్పటికీ, పేద కుటుంబాల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సామాజిక పెన్షన్ మొత్తాన్ని రూ.4000కి పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇది కూటమి ప్రభుత్వం పేదల పట్ల చూపుతున్న నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వివిధ కేటగిరీలలో దాదాపు 21 వేల మందికి సామాజిక పెన్షన్లు అందజేయబడుతున్నాయని, ఇంకా అర్హులైన వారు ఎవరికైనా మిగిలి ఉంటే రానున్న రోజుల్లో వారిని కూడా ఈ పథకంలో చేర్చి పెన్షన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. గతంలో వ్యక్తిగత ద్వేషాలతో, రాజకీయ కారణాలతో తొలగించబడిన పెన్షన్లను కూడా పునరుద్ధరిస్తామని తెలిపారు.

*ఇటీవల కొందరు నేతలు చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ…*

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా, నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని, అది ప్రతి ఒక్కరికీ కళ్లకు కనిపిస్తోందని అన్నారు. అభివృద్ధి లేకుండా రాష్ట్రాన్ని పూర్తిగా వెనక్కి నెట్టిన గత ప్రభుత్వం తమ ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోకుండా, అస్తిత్వం కాపాడుకోవడానికి మాత్రమే దుష్ప్రచారాలు చేస్తోందని విమర్శించారు.

వ్యక్తిగత విమర్శలు, రాజకీయ దూషణలకు స్పందించడం సమయ వృథా అని పేర్కొంటూ, ప్రజలందరూ అలాంటి వ్యాఖ్యలను పట్టించుకోవద్దని ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు సూచించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సింగంశెట్టి వీరయ్య, రుస్తుం బాబు, మొహమ్మద్ రఫీ, సుధారాణి, తోట వెంకటేస్వర్లు,ఖాదర్ బుడే తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: ఆ కోళ్లు మృతి చెందింది బర్డ్ ఫ్లూ తోనే: జేడీ
అన్నమయ్య జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ గుణశేఖర్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం, పుంగనూరు...
By Kothuru Murali 2026-02-11 08:04:20 0 184
Andhra Pradesh
గ్రూప్-2 ఫలితాలలో విజయం సాధించిన మన ఆళ్లగడ్డ కీర్తిని రాష్ట్ర స్థాయిలో చాటిన నలుగురు అభ్యర్థులు
గ్రూప్-2 ఫలితాల్లో విజయం సాధించి, మన ఆళ్లగడ్డ కీర్తిని రాష్ట్రస్థాయిలో చాటిన నలుగురు అభ్యర్థులకు...
By Chennaiah Kati 2026-02-04 08:30:23 0 261
Andhra Pradesh
పుంగనూరులో ఆలయ అంగడి గదుల కూల్చివేత, భక్తుల ఆందోళన
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో 30 ఏళ్ల క్రితం దాతలు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి దానం...
By Kothuru Murali 2026-04-09 07:31:58 0 158
Uttar Pradesh
Uttar Pradesh Gears Up for PM Modi’s Visit with Major Infrastructure Launches
Uttart Pradesh - Uttar Pradesh is making extensive preparations ahead of Prime Minister Narendra...
By Bharat Aawaz 2025-07-28 11:51:46 0 1K
Telangana
గ్యాస్‌ సిలిండర్ల మార్కెట్‌లో అధిక ధరలకు రూ. 3,500 నుంచి 4 వేలు
రూ. 3,500 నుంచి 4 వేలు హైదరాబాద్‌ మహా నగరంలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల సరఫరా...
By Pinnehasan Odela 2026-03-12 11:18:13 0 251
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com