ఐ.ఎం.ఏ రాష్ట్రశాఖ* *ఉత్తమఅధ్యక్షుని జాతీయ* *అవార్డు* *అందుకున్న డాక్టర్ జి.* *నందకిషోర్*

0
228

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐ .ఎం .ఎ)ప్రతి ఏటా జాతీయ స్థాయిలో ఇచ్చే ఉత్తమ రాష్ట్ర అధ్యక్షుని అవార్డు 2024 -2025 సంవత్సరముకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన డాక్టర్ గార్లపాటి నందకిషోర్ కు లభించింది. ఈ అవార్డును గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించిన ఐ.ఎం.ఏ జాతీయ సదస్సు లో ఏర్పాటుచేసిన అవార్డుల ప్రదా నోత్సవ కార్యక్రమంలో... గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ శంకర్ చౌదరి, రాజ్యసభ సభ్యులు మాన్య నాయక్, ఐ.ఎం.ఏ జాతీయఅధ్యక్షులు డాక్టర్ దిలీప్ బన్సాలి ,జాతీయ కార్యదర్శి సర్బరీ దత్త తదితరులసమక్షంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జైయ్ షా

చేతుల మీదగా డాక్టర్ నందకిషోర్ అందుకున్నారు. 2024 -2025 సంవత్సరంలో అధ్యక్షునిగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి వైద్యులను అనేక సమాజ హిత విషయాలలో చైతన్య పరిచినందుకు , వైద్యుల, ప్రజారోగ్య సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేసినందుకు గాను ఈ అవార్డు లభించిందన్న విషయం తెలిసిందే. డాక్టర్ నందకిషోర్ అవార్డు ప్రధానో త్సవ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖకు చెందిన ఐ.ఎం.ఏ పూర్వ జాతీయ అధ్యక్షులు డాక్టర్ జి. సమరం ,రాష్ట్రపూర్వ అధ్యక్షులు డాక్టర్ నాగళ్ళ కిషోర్, డాక్టర్ సి.హెచ్. శ్రీనివాసరాజు, ప్రస్తుతఅధ్యక్షులు డాక్టర్ ఎస్. బాలరాజు, ఏ.పీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డి. శ్రీహరి రావు ,ఐఎంఏ పూర్వ కార్యదర్శి డాక్టర్ పి. ఫణిదర్ ఐ.ఎం.ఏ గుంటూరు శాఖ అధ్యక్షులు డాక్టర్ టి. సేవకుమార్, ఐఎంఏ సిజిపి రాష్ట్ర కార్యదర్శి కార్యదర్శి డాక్టర్ ఎం .వి.వి.మురళీమోహన్, డాక్టర్ వి. మహేష్, డాక్టర్ డి. భరత్ కుమార్ లతో పాటు దేశవ్యాప్తంగా విచ్చేసిన 2000 మందికి పైగా వైద్యులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
మనూర్ :- రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
మనూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వంపై తీవ్రస్థాహిలో ద్వాజమేత్తరు. కాంగ్రెస్...
By Gandla Vaijanath 2026-04-07 12:17:59 0 580
Jammu & Kashmir
TMC Bats for Restoration of Jammu and Kashmir’s Statehood
TMC Bats for Restoration of Jammu and Kashmir’s Statehood The Trinamool Congress (TMC) has...
By BMA ADMIN 2025-05-23 11:05:54 0 2K
Andhra Pradesh
శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్.
శక్తి యాప్ ద్వారా యువతిని రక్షించిన మంగళగిరి గ్రామీణ పోలీసులు పోలీసుల పనితీరును ట్విట్టర్...
By Pagadala Venkateswar 2026-04-27 06:15:37 0 140
Andhra Pradesh
పొలం పనుల్లో దంపతులపై దాడి: నలుగురిపై ఆరోపణలు.
అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం కంటేవారిపల్లి, రేగడలో పొలం పనులు చేస్తున్న దంపతులపై జయరాం, రెడ్డి...
By Pagadala Venkateswar 2026-04-05 06:17:11 0 219
Andhra Pradesh
క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ 'పల్లె నిద్ర' పర్యటన
క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ 'పల్లె నిద్ర' పర్యటన టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో 'పల్లె...
By Chennaiah Kati 2026-07-11 04:44:04 0 99
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com