ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి -రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

0
338

మహబూబాబాద్,డిసెంబర్ 22 (భారత్ అవాజ్):రాష్ట్రంలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాదు నుండి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు - కలెక్టర్లు, ఈ. ఆర్. ఓ.లు, ఎ. ఈ. ఆర్. ఓ. లతో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసే విధంగా ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దృష్ట్యా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, పట్టణ ప్రాంతాలలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ రోజుకి 10 వేల చొప్పున చేస్తూ నిర్దిష్ట గడులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వచ్చే వారంలోగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో వృద్ధి నమోదు కావాలని, మ్యాపింగ్ ప్రక్రియతో పాటు ఓటర్ల జాబితాలో బ్లర్ ఫోటోగ్రాఫ్/స్మాల్ ఫోటోగ్రాఫ్/ఇంప్రాపర్ ఫోటోగ్రాఫ్ ల గుర్తింపు చేపట్టాలని, ఫారం 8 ద్వారా అసలైన ఫోటోగ్రాఫ్ సేకరించి నవీకరించాలని, ఈ ప్రక్రియ జనవరి, 2026 లోగా పూర్తి చేయాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులతో జిల్లా ఎన్నికల అధికారి  కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, మాట్లాడుతూ ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని, బి.ఎల్.ఓ. ల వారీగా సమీక్ష నిర్వహించి పురోగతి సాధించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.అనిల్ కుమార్, రెవెన్యూ డివిజన్ అధికారి కృష్ణవేణి, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, అన్ని మండలాల తహసీల్దారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
వెంకట్ మహేశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ వారి సేవ స్ఫూర్తి
వెంకట్ మహేశ్వర్ చారిటబుల్ ట్రస్ట్  ఆకలితో ఉన్న చిన్నారులకు,...
By Rajini Kumari 2025-12-28 10:21:43 0 205
BMA
Regional Journalism Gains Digital Momentum
Regional journalism is entering a new era through digital platforms that enable local stories to...
By JoinBMA 2026-08-20 09:52:51 0 139
Telangana
14 యేళ్ళు ఉద్యమం నడపాలంటే ఎన్ని ఆర్ధిక వనరులు కావాలి...
 ప్రతి మండలానికి ధూమ్ ధాం ప్రోగ్రామ్ చెయ్యాలి అంటే ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది? ...
By Ponnala Srinivasrao 2026-06-04 05:35:20 0 130
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా కలెక్టర్ ప్రశాంత్ కుమార్ గారుబుధవారం పుంగనూరులో పర్యటించారు
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం పుంగనూరు పట్టణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా...
By Kothuru Murali 2025-12-31 14:33:00 0 382
Telangana
ఘనంగా SRP-I ఇంక్లైన్ గని స్వర్ణోత్సవ వేడుకలు
మంచిర్యాల : సింగరేణి సంస్థ అభివృద్ధిలో శ్రీరాంపూర్-1 ఇంక్లైన్ గని తన విశిష్ట ప్రస్థానాన్ని...
By Avunoori Mahesh 2026-09-02 14:10:56 0 144
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com