Bharat Aawaz

ఓటు డిలీట్ అయినవారికి మరో ఛాన్స్👍👍👍

Chakrala Sadhanand
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
76
Views

ఓటు డిలీట్ అయినవారికి మరో ఛాన్స్

 

'SIR'లో ఓట్లు డిలీట్ అయిన వారికి ఎలక్షన్ కమిషన్ మరో అవకాశం కల్పించింది.ఫారం-6, 8 ద్వారా ఏపీ, తెలంగాణ సహా ఢిల్లీ, మహారాష్ట్ర, హరియాణా, ఝార్ఖండ్, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది.అర్హులైన వారిని తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చడమే దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొంది. ఓటు డిలీట్ అయిందని బాధపడాల్సిన అవసరం లేదు. మీ పేరు లిస్టులో ఉందో లేదో ముందుగా voters.eci.gov.in వెబ్‌సైట్‌లో లేదా మీ BLO వద్ద చెక్ చేసుకోండి.పేరు లేకపోతే ఫారం-6 ద్వారా కొత్తగా నమోదు చేసుకోవచ్చు. పేరులో తప్పులు, చిరునామా మార్పు ఉంటే ఫారం-8 ద్వారా సరిచేసుకోవచ్చు. ఆయా ఫారాల్లో ఆధార్ వివరాలు ఇవ్వడమనేది పూర్తిగా స్వచ్ఛందమని ఈసీ స్పష్టం చేసింది. ఆధార్ లేకపోయినా ఓటు నమోదుకు అడ్డంకి ఉండదని తెలిపింది.

కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఓటు హక్కును కాపాడుకోవాలని అధికారులు సూచించారు.