Bharat Aawaz

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు తుడుందెబ్బ మద్దతు కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్

Chunarkar Jagadeesh
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
112
Views

🎤ఆసిఫాబాద్, (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమ్మెకు తుడుందెబ్బ సంఘం పూర్తి మద్దతు ప్రకటించింది. ఎన్‌హెచ్‌ఎం సిబ్బందిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని తుడుందెబ్బ జాతీయ అధ్యక్షుడు కోట్నాక విజయ్ ప్రభుత్వాన్ని కోరారు.

ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట గత 18 రోజులుగా శాంతియుతంగా కొనసాగుతున్న ఉద్యోగుల నిరాహార దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి, సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత్రింబవళ్లు ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, నర్సులు, ఏఎన్‌ఎంల సమస్యలను ప్రభుత్వం తక్షణమే గుర్తించాలన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి సేవలు అందిస్తున్న సిబ్బందికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, వారి డిమాండ్లను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.