Bharat Aawaz

జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ కాలుష్యంతో రాంపల్లి చెరువుకు ముప్పు.|

Sidhu Maroju
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
4 min read
0
Comments
156
Views

● జన సంకల్ప యాత్రలో చెరువును పరిశీలించిన ఎంపీ ఈటల రాజేందర్

● రజకులు, గౌడులు, రైతులు, పశువులపై కాలుష్య ప్రభావం

● గ్రామస్థుల సమస్యలు విని శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

అల్వాల్, 28 అక్టోబర్: జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ కారణంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తెచ్చి, వాటి పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యంగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ చేపట్టిన జన సంకల్ప యాత్రలో భాగంగా రామపల్లి గ్రామంలోని చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ నుంచి వెలువడుతున్న వ్యర్థాలు, కలుషిత నీటి కారణంగా రామపల్లి చెరువు కలుషితమవుతోందని స్థానికులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల చెరువుపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న రజకులు, గౌడులతో పాటు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కలుషిత నీటి ప్రభావంతో పశువులు అనారోగ్యానికి గురవుతున్నాయని, చెరువు పరిసరాల్లోని ఇళ్లలోకి సైతం మురుగునీరు ప్రవేశిస్తోందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులు ప్రజల ఆరోగ్యంతో పాటు వ్యవసాయం, పశుపోషణ, స్థానికుల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వివరించారు.

గ్రామస్థుల నుంచి సమస్యలను తెలుసుకున్న ఈటల రాజేందర్.. డంపింగ్ యార్డ్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారానికి సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని సూచించారు. చెరువు కాలుష్యానికి కారణాలను గుర్తించి, ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి హాని కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. సమస్యను నిర్లక్ష్యం చేయకుండా శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేయాలని పేర్కొన్నారు.

రామపల్లి చెరువు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, డంపింగ్ యార్డ్ ప్రభావిత గ్రామాల ప్రజల ఆరోగ్యం, పర్యావరణం, జీవనోపాధిని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

#Sidhumaroju

Alwal