Madanapalle: మదనపల్లె కలెక్టరేట్ వద్ద దళిత, గిరిజనుల హక్కుల కోసం భారీ ధర్నా. సబ్‌ప్లాన్ నిధులు, భూ పంపిణీ, స్మశాన స్థలాల కోసం ఏఐఏడబ్ల్యూయూ, కేవీపీఎస్ నిరసన.

0
72

Madanapalle: దళిత, గిరిజనుల హక్కుల పరిరక్షణతో పాటు వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం (AIAWU), కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

 

“కుల వివక్షకు చరమగీతం పాడాలి.. దళిత, గిరిజనులకు న్యాయం చేయాలి” అనే డిమాండ్‌తో మిషన్ కాంపౌండ్ నుంచి ప్రదర్శనగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అనంతరం నిర్వహించిన ధర్నాలో వృత్తి సంఘాల రాష్ట్ర కార్యదర్శి పి. వెంకటరావు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 80 ఏళ్లు గడిచినా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన హక్కులు, ఆశయాలు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.

 

జస్టిస్ పున్నయ్య కమిషన్ నివేదిక మేరకు దళిత, గిరిజనులకు కేటాయించిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను పక్కదారి పట్టించకుండా పూర్తిస్థాయిలో కేటాయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కోనేరు రంగారావు సిఫారసులను అమలు చేసి భూమిలేని ప్రతి దళిత వ్యవసాయ కుటుంబానికి రెండు ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయించాలని కోరారు.

 

 

Search
Categories
Read More
Sports
HAPPY BIRTHDAY HARBHAJAN SINGH!! .
From being a match-winner for Team India to a total livewire in the commentary box, Harbhajan...
By Bharat Aawaz 2025-07-03 06:39:19 0 3K
International
Ebola Variant 2026: The New Global Threat We Weren't Ready For
The world faces a chilling new wake-up call as a deadly Ebola variant emerges from the Democratic...
By Hazu MD. 2026-05-21 12:53:37 0 476
Andhra Pradesh
మదనపల్లె: RTC బస్సు కండక్టర్ దురుసు ప్రవర్తన.
పుంగనూరు డిపోకు చెందిన ఓ ఆర్టీసీ కండక్టర్ మదనపల్లెలో బస్సు ఎక్కిన వృద్ధురాలితో దుర్భాషలాడటం తీవ్ర...
By Pagadala Venkateswar 2026-04-11 06:20:11 0 145
Andhra Pradesh
కూటమి ప్రభుత్వం రికార్డ్ స్థాయిలో పారదర్శకంగా పోస్టుల భర్తీ ప్రక్రియ
కూటమి ప్రభుత్వం రికార్డ్ స్థాయిలో పారదర్శకంగా పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టడమే కాకుండా, మా...
By SivaNagendra Annapareddy 2025-12-22 13:10:20 0 874
Andhra Pradesh
Andhra Pradesh Rains: ఏపీకి వర్ష సూచన.. దక్షిణ కోస్తాలో వడగళ్ల వాన హెచ్చరిక!.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ...
By Pagadala Venkateswar 2026-03-20 09:43:15 0 244
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com