కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మత్స్య వాహనాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

0
304

🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చేపల విక్రయాలను పెంపొందించడంతో పాటు, మత్స్య ఆహార పదార్థాల తయారీ-విక్రయాల ద్వారా ఉపాధి పొందేందుకు ప్రభుత్వం సరికొత్త అవకాశాన్ని కల్పించింది. కేంద్ర ప్రభుత్వ 'ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన' (PMMSY) పథకం కింద జిల్లాకు 2 మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్‌లెట్ వాహనాలు మంజూరైనట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి సాంబశివరావు మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ వాహనాల కొనుగోలుకు ఆసక్తి కలిగిన జిల్లా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ పథకం ఆర్థిక వివరాలను ఆయన వివరిస్తూ.. మంజూరైన ఒక్కో మొబైల్ వాహనం యొక్క మొత్తం విలువ రూ.10 లక్షలు ఉంటుందని, ఇందులో లబ్ధిదారులకు రూ.4 లక్షల వరకు ప్రభుత్వ సబ్సిడీ లభిస్తుందని పేర్కొన్నారు. సబ్సిడీ మినహాయించగా మిగిలిన లబ్ధిదారుడి సొంత వాటా కింద రూ.6,65,164 మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థులు నిర్ణీత మొత్తానికి సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్ (DD)తో పాటు తమ దరఖాస్తులను ఆగష్టు 24వ తేదీ లోగా జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో సమర్పించాలని అధికారి సాంబశివరావు సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
*స్థల డాక్యుమెంట్లు గల్లంతు
ఈపూరుపలెం చీరాల మండలం ఈపురుపాలెం గ్రామానికి చెందిన గుద్దంటి గోపీచంద్‌కు సంబంధించిన 274-3B...
By Vadlamudi NagaVenkat 2026-09-05 06:48:23 0 118
Andaman & Nikobar Islands
India and Japan Push Forward 'Smart Island' Plan for Andaman & Nicoba
In early June, India and Japan strengthened their partnership to develop the Andaman &...
By Bharat Aawaz 2025-07-17 08:37:30 0 1K
Andhra Pradesh
👉 జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు..
👉 జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు.. 👉 రోడ్డు ప్రమాదాల...
By Chennaiah Kati 2026-06-22 05:21:27 0 102
Andhra Pradesh
ఖబర్దార్ వాల్మీకిల జోలికొస్తే సహించేది లేదని రామ్ భీం నాయుడు హెచ్చరించారు
ఆదోని నియోజకవర్గం లోని బోయ కులానికి చెందిన ఒక ఉద్యోగి బీటీ సురేష్ కులం పేరుతో దూషించడం మంచి...
By Boya Dasthagiri 2026-05-21 08:26:20 0 265
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com