ముగిసిన సమయం.. శ్రీకాకుళం జైలు వద్ద జగన్, సీదిరి అప్పలరాజుల ములాఖత్ రద్దు.

0
102

రోడ్డు ప్రమాదం కేసులో అరెస్టయి శ్రీకాకుళం అంపోలు జైల్లో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో వైసీపీ అధినేత జగన్ ములాఖత్ చివరి నిమిషంలో రద్దయింది. ములాఖత్ కోసం జగన్ కు జైలు అధికారులు సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చారు. అయితే జైలు వద్దకు జగన్ చేరుకునే సమయానికి నిర్ణీత గడువు ముగిసిపోయింది. సమయం దాటిన తర్వాత కూడా అప్పలరాజును కలిసేందుకు వైసీపీ నేతలు అనుమతి కోరగా, జైలర్ ఉన్నతాధికారులతో సంప్రదించారు. జైలు నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని, సాయంత్రం 5 గంటల దాటిన తర్వాత ఎలాంటి ములాఖత్‌కు అనుమతి లేదని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

 

జైలు నిబంధనల దృష్ట్యా అధికారుల నుంచి అనుమతి లభించకపోవడంతో జగన్, సీదిరి అప్పలరాజుల ములాఖత్ రద్దయింది. అనంతరం జైలు ప్రాంగణం వద్దే వేచి ఉన్న అప్పలరాజు కుటుంబ సభ్యులను జగన్ కలిసి పరామర్శించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: కబ్జా కాకుండా నా స్థలాన్ని కాపాడండి: స్వర్ణలత.
మదనపల్లె పట్టణంలోని పాతకచేరి వీధికి చెందిన కరమల స్వర్ణలత, తనకు చెందిన స్థలాన్ని కొందరు...
By Pagadala Venkateswar 2026-06-12 04:29:21 0 108
Andhra Pradesh
గ్రామ, వార్డు స్థాయి కమిటీల నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న రీజినల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారు, శ్రీ సత్యసాయి జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ గారు.
నేడు మనందరి ప్రియతమ నాయకుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి...
By John Baji 2026-01-12 04:16:55 0 231
BMA
Tamil Nadu Arrests Journalist Over Digital Interview
Independent Tamil journalist and YouTuber Mukhtar Ahmed was arrested by the Chennai Cyber Crime...
By JoinBMA 2026-08-19 07:54:06 0 156
Himachal Pradesh
Southwest Monsoon Officially Arrives in Himachal Pradesh
The southwest monsoon has officially made its arrival in Himachal Pradesh, bringing much-needed...
By Lokeshwari Panthadi 2026-07-01 05:43:52 0 140
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com