ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హాస్టల్ సందర్శించడం జరిగింది కోసిగి పట్టణంలో

0
125

విద్యార్థులపై హాస్టల్ వార్డెన్ వేధింపులు 

హాస్టల్ కాలీ చేయాలని భయభ్రాంతులకు గురిచేస్తున్న వార్డెన్

పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకోవడం వార్డెన్ ఇష్టం లేదా? ప్రశ్నించిన...ఏఐఎస్ఎఫ్ నాయకులు

విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న వార్డెన్ పై కఠిన చర్యలు తీసుకోవాలి"ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు యస్.ఈరేష్ డిమాండ్

కోసిగి మండల కేంద్రంలో స్థానికంగా ఉన్న ఇంటిగ్రేడ్ హాస్టల్ విద్యార్థుల పట్ల హాస్టల్ వార్డెన్ వ్యవహరిస్తున్న తీరుపై శనివారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇంటిగ్రేడ్ హాస్టల్ ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు యస్.ఈరేష్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల నుండి విద్యను అభ్యసించడానికి వచ్చిన పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడం హాస్టల్ వార్డెన్ గారికి ఇష్టం లేదా అని హాస్టల్ వార్డెన్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 80 మంది పైగా విద్యార్థులు హాస్టల్‌లో ఉంటూ విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థులను మానసికంగా,భౌతికంగా ఇబ్బందులకు గురిచేస్తూ, వారిని భయభ్రాంతులకు గురిచేయడం వెనుక ఉన్న అంతర్యం ఏంటో అధికారులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుండి ఏలాంటి ఆర్డర్స్ అనుమతులు లేకుండానే సొంత నిర్ణయాలతో హాస్టల్ వార్డెన్ విద్యార్థులను వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లాలని అలాగే హాస్టల్లో ఉన్న విద్యార్థులను సోమవారం అందరూ ఖాళీ చేసి వెళ్లిపోవాలని చెప్పడం ఏంటని వార్డెన్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. నిరుపేద విద్యార్థులకు అండగా ఉండాల్సిన వార్డెన్, విద్యార్థులు హాస్టల్ ఖాళీ చేపించారు మరి కొంతమంది వెళ్ళిపోయేలా బెదిరించారు. మొత్తం విద్యార్థులు కాళీ చేపించే లా ప్రవర్తించడం దారుణం అన్నారు హాస్టల్ కు విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఇలాంటి అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకుండా ఉన్నత అధికారులు బీసీ వెల్ఫేర్ అసిస్టెంట్ శ్రీనివాసులు సార్ వత్తాసు పలుకుతున్నారని ఇలాంటి అధికారులపై జిల్లా కలెక్టర్ గారు స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా పోరాటానికి విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఏకం చేసి ఆందోళనలు, ధర్నాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు రవి,సురేష్, మల్లికార్జున నరేష్ వంశి అమ్రేష్ చందు అజయ్ కుమార్ ఈరన్న తదితర హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Architect of Progress: The Legacy of Shri Anil Mukim
Visionary Governance, Administrative Acumen, and Decades of Unwavering Service to Gujarat and...
By Kalaga Sailaja 2026-07-28 12:57:45 0 229
Bharat
124 నాటౌట్: పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల వినూత్న నిరసన
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ తప్పిదాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వెలుపల వినూత్నంగా...
By Bharat Aawaz 2025-08-12 09:44:50 0 2K
Andhra Pradesh
పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం RTCలో PPP (పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్) విధానాన్ని తీసుకురావడం,...
By Rajini Kumari 2026-06-22 12:51:05 0 355
Karnataka
Karnataka Strengthens Rural Development and Panchayats
Karnataka continues to promote rural development in 2026 by strengthening Panchayati Raj...
By Fathima Safa 2026-07-04 12:29:44 0 105
SURAKSHA
Rajarshi Shah, IAS: Leading Adilabad with Purpose
A Young IAS Officer Transforming District Administration Through Transparent Governance,...
By Lokeshwari Panthadi 2026-07-14 08:24:38 0 235
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com