యోగా వ్యాప్తికి బాబా రామ్‌దేవ్‌తో కలిసి పనిచేస్తాం... ఉండవల్లి గుహల వద్ద జాతీయ మీడియాతో చంద్రబాబు.

0
101

 

యోగా వ్యాప్తికి బాబా రామ్‌దేవ్‌తో కలిసి పనిచేస్తాం... ఉండవల్లి గుహల వద్ద జాతీయ మీడియాతో చంద్రబాబు

20-06-2026 Sat 15:15

Andhra

Chandrababu Naidu will work with Baba Ramdev to spread Yoga says CM at Undavalli Caves

ప్రతి ఇంటికి యోగాను తీసుకెళ్లడమే లక్ష్యమని ప్రకటించిన సీఎం చంద్రబాబు

యోగా వ్యాప్తి కోసం బాబా రామ్‌దేవ్‌తో కలిసి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి

హైదరాబాద్ ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నట్లు కీలక వ్యాఖ్యలు

టెక్నాలజీతో పాటు సంస్కృతి, ఆధ్యాత్మికత యువతకు ముఖ్యమని సూచన

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఇంటికీ యోగాను తీసుకెళ్లడమే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. యోగాను రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌తో కలిసి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఉండవల్లి గుహల వద్ద శనివారం జరిగిన 'యోగాంధ్ర' కార్యక్రమంలో భాగంగా ఆయన జాతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, అమరావతిని కేవలం పరిపాలనా రాజధానిగానే కాకుండా హెల్తీ, వెల్తీ, హ్యాపీ, ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గతంలో తాను నిర్మించిన సైబరాబాద్ తరహాలోనే, ఇప్పుడు అమరావతిని 'హైదరాబాద్ ప్లస్'గా నిర్మిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

 

"సైబరాబాద్ నిర్మాణం తర్వాత అమరావతిని నిర్మించే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు. తెలంగాణకు హైదరాబాద్ ఎలాగైతే ప్రధాన ఆదాయ వనరుగా మారిందో, అదే స్థాయిలో అమరావతిని అభివృద్ధి చేస్తాం" అని అన్నారు.

 

టెక్నాలజీని అనుసంధానిస్తూనే, అమరావతిని ఒక నాలెడ్జి హబ్‌గా తీర్చిదిద్దుతామని వివరించారు. యోగా అనేది ప్రపంచానికి భారత్ ఇచ్చిన అమూల్యమైన బహుమతి అని, దాని ద్వారా మానసిక ఒత్తిడిని అధిగమించి ఏకాగ్రత సాధించవచ్చని తెలిపారు. టెక్నాలజీ ఒక్కటే సంపదను సృష్టించదని, భారతదేశానికి ఉన్న అసలైన శక్తి సంస్కృతి, ఆధ్యాత్మికత అని అన్నారు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ యువత ముందుకు సాగాలని చంద్రబాబు సూచించారు.

Search
Categories
Read More
Telangana
మహబూబాబాద్ జిల్లా
*మహబూబాబాద్ జిల్లా:-* *తొర్రూరు మండలంలోని గుర్తురు గ్రామ శివారు లో సబ్ స్టేషన్ దగ్గర మామిడి...
By Ellandula Sandeep 2026-03-03 14:37:29 0 494
Andhra Pradesh
Madanapalle: వారణాసిలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన మదనపల్లె బీజేపీ నేత మిట్టా వంశీకృష్ణ. ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ పురస్కరించుకుని బీజేవైఎం బైక్ యాత్ర!
Madanapalle: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  జన్మదినం సందర్భంగా, ముఖ్యమంత్రి మరియు ప్రధానమంత్రి...
By Pagadala Venkateswar 2026-09-19 06:32:27 0 40
Andhra Pradesh
పవన్ కల్యాణ్ ను కలిసిన రామ్ చరణ్..
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భేటీ మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో...
By Pagadala Venkateswar 2026-06-25 06:10:41 0 94
SURAKSHA
Breaking Glass Ceilings: The Inspiring Journey of IPS Kala Ramachandran
Breaking Ceilings: Inside IPS Kala Ramachandran’s Inspiring Journey: "Basic policing, the...
By Kalaga Sailaja 2026-07-21 05:30:38 0 108
SURAKSHA
Syedain Abbasi IAS: A Visionary Administrator Transforming Assam
A 1990-batch Assam–Meghalaya cadre IAS officer whose decades of administrative excellence...
By Kalaga Sailaja 2026-07-23 07:03:44 0 97
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com