ఏపీ మోడల్ అద్భుతం.. ఇక దేశమంతా ఇదే విధానం!

0
89

 

ఏపీ మోడల్ అద్భుతం.. ఇక దేశమంతా ఇదే విధానం!

 

Andhra

AP Model is Wonderful Same System Across Country Now

దేశవ్యాప్తంగా రేషన్ బియ్యం బస్తాలకు క్యూఆర్ కోడ్ విధానం

ఏపీలో విజయవంతమైన పైలట్ ప్రాజెక్టును ప్రశంసించిన కేంద్రం

తిరుపతిలో ప్రకటన చేసిన కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి

ఈ విధానంతో బియ్యం పక్కదారి పట్టకుండా పర్యవేక్షణ

చంద్రబాబు ప్రభుత్వ పర్యవేక్షణ అద్భుతమన్న కేంద్రమంత్రి

దేశవ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా సరఫరా చేసే బియ్యం బస్తాలపై ఇకపై క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ నూతన విధానం ద్వారా రేషన్ బియ్యం పంపిణీలో పారదర్శకత పెరగడమే కాకుండా, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పర్యవేక్షణ అద్భుతంగా ఉందని ఈ సందర్భంగా ప్రశంసించారు. ఏపీలో అమలు చేస్తున్న క్యూఆర్ కోడ్ విధానం వల్ల రేషన్ బియ్యం పక్కదారి పట్టడం ఆగిపోయిందని, మిల్లింగ్ పాయింట్ నుంచి లబ్ధిదారుడికి చేరే వరకు ప్రతి దశను కచ్చితంగా ట్రాక్ చేసే వీలు కలిగిందని వివరించారు. ఈ విజయవంతమైన ‘ఏపీ నమూనా’ ఆధారంగానే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని విస్తరిస్తున్నట్లు తెలిపారు.

 

పీడీఎస్ వ్యవస్థను ఆధునికీకరించడం, అక్రమాలను అరికట్టి సబ్సిడీ ఆహార ధాన్యాలు అర్హులైన లబ్ధిదారులకే చేరేలా చూడటమే ఈ చర్యల ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లోనూ ఈ విధానాన్ని విస్తరించేందుకు కేంద్రం అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా, సాంకేతికత ఆధారంగా సమర్థవంతమైన పాలన అందించడంలో భాగంగానే ఈ విధానాన్ని తీసుకువచ్చినట్లు జోషి వివరించారు.

 

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అందిస్తున్న సహాయం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. గత యూపీఏ ప్రభుత్వంతో పోలిస్తే రాష్ట్రానికి 325 శాతం అధికంగా నిధులు కేటాయించామని తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్రం తరపున పూర్తి సహకారం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.                                

Search
Categories
Read More
SURAKSHA
Women Safety: Pen Safety Teams Active Patrol
 Tamil Nadu Police Pen Safety Teams patrol buses, colleges, markets and railway stations for...
By Kalaga Sailaja 2026-07-02 05:44:20 0 150
Manipur
Manipur Strengthens Women Empowerment and Welfare
Manipur is advancing women empowerment and social welfare through targeted schemes aimed at...
By Fathima Safa 2026-06-24 11:53:40 0 245
Andhra Pradesh
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు సంవత్సరాల పాలన అభివృద్ధి సంక్షేమం గురించి డోర్ టు డోర్ కార్యక్రమం
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు సంవత్సరాల పాలన అభివృద్ధి సంక్షేమం...
By Chennaiah Kati 2026-07-30 07:51:44 0 202
Andhra Pradesh
Chandrababu Naidu: మన్ కీ బాత్... ప్రధాని మోదీకి థాంక్స్ చెప్పిన సీఎం చంద్రబాబు
'మన్ కీ బాత్' కార్యక్రమంలో అనంతపురం ప్రజలను ప్రశంసించిన ప్రధాని మోదీ జల వనరుల పునరుద్ధరణలో వారి...
By Pagadala Venkateswar 2026-01-25 12:18:00 0 202
Andhra Pradesh
విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్.. జూన్ 1 నుంచి కార్యకలాపాలు.
కొత్త జోన్ పరిధిలోకి విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు నెరవేరిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన...
By Pagadala Venkateswar 2026-05-29 05:31:44 0 106
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com