14వ డివిజన్లో పింఛన్లు పంపిణీ చేసిన గద్దె రామ్మోహన్

0
202

*పేదలకు భరోసా కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం*

*14వ డివిజన్‌లో ఫించన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌*

*రూ.15 వేల విలువ చేసే తోపుడు బండిని నిరుపేద మహిళకు ఉచితంగా అందచేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌*

*++++*

           కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ పేదలకు భరోసా కల్పిస్తోందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచి క్రమం తప్పకుండా ఒకటో తేదీన లబ్ధిదారుల ఇళ్ళకు వెళ్ళి ఫించన్లు అందచేస్తున్నామని చెప్పారు. 

 

సోమవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్‌లోని పటమట రామాలయం దగ్గర తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన స్వయంగా పరిశీలించి వాటిని పరిష్కరించాల్సిందిగా ఆయా విభాగాల అధికారులను ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ ఆదేశించారు. డివిజన్‌లోని లబ్ధిదారులకు ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ స్వయంగా పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం డివిజన్‌లోని నిరుపేద కుటుంబానికి చెందిన గణేషుల పార్వతికి జీవనోపాధి నిమిత్తం రూ.15 వేల విలువ చేసే తోపుడు బండిని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ తన సొంత నిధులతో కోనుగోలు చేసి అమెకు ఉచితంగా అందచేశారు.  

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ ప్రతి నెలా ఒకటో తేదీన లబ్ధిదారులకు స్వయంగా ఇంటికి వెళ్ళి క్రమం తప్పకుండా ఫించన్లు అందచేస్తున్నామని చెప్పారు. ఒకటో తేదీ సెలవు రోజు అయితే ముందు రోజునే ఫించన్లు అందచేస్తూ పేదలకు భరోసా కల్పిస్తున్నామన్నారు. ఒక రోజులోనే నూటికి నూరు శాతం పింఛన్లను సచివాలయ ఉద్యోగుల అందచేస్తున్నారని చెప్పారు. పురుషులు సంపాదించిన సొమ్మును ఇంటి ఖర్చులకు కాకుండా వారి వ్యక్తిగతంగా చెడు వ్యసనాలకు ఖర్చు చేస్తున్నారని, అందువల్ల మగవాళ్ళ అలవాట్లలో మార్పులు రావాలని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే పింఛన్ల సొమ్ముతోనే కొంత మంది మహిళలు ఇంటి ఖర్చులను నిర్వహిస్తున్నారని, అందువల్ల మద్యానికి బానిసలు కాకుండా పురుషులు ఇంటి నిర్వహణపై దృష్టి పెట్టాలన్నారు. అప్పుడే రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపగలమని అన్నారు. పురుషులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ కుటుంబానికి అండగా ఉంటూ పేదరికం నుంచి బయటపడాలని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అన్నారు. 

 

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కర్ణ రమేష్, పోతంశెట్టి నాగేశ్వరరావు, యడ్లపల్లి నాగరాజు, గరికపాటి బద్రి, డాంగే కుమారి, రామాయణపు సాంబయ్య, రేపాకుల ప్రసాద్, చిట్టా నిర్మల, షేక్‌ ఫాతిమా, పొట్లూరి రవీంద్ర, పోతిరెడ్డి వెంకట్రావ్, వెంకన్న, కెల్లా రమేష్‌ నాయడు, వీర్ల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
BMA
The Creator Crash: Investigating Digital Viability
Business journalists are systematically dismantling the "creator economy" myth. New financial...
By JoinBMA 2026-08-21 09:16:30 0 172
Andhra Pradesh
చిన్నారి సుస్మితకు ఆశీస్సులు అందించిన టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు
చిన్నారి సుస్మితకు ఆశీస్సులు అందించిన టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు...
By Chennaiah Kati 2026-07-05 14:17:42 0 125
Andhra Pradesh
కేరళలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం
*కేరళలో సైకిల్‌ తొక్కుతూ రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచారం*    లోక్‌సభలో...
By Rajini Kumari 2026-03-31 17:02:53 0 181
SURAKSHA
Shaik Darvesh Saheb IPS: Leading Kerala Police with Integrity, Vision and Commitment
"The true strength of policing lies not only in enforcing the law but also in earning the trust...
By Fathima Safa 2026-07-08 07:24:49 0 212
Telangana
కూకట్పల్లి ఆర్టీసీ బస్సు డిపోకు 60 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయింపు, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభం
హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునీకరించే దిశగా కూకట్‌పల్లి డిపోకు 60...
By Jagadeesh Babu 2026-05-27 15:02:04 0 408
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com