"అల్వాల్‌లో యువతి అదృశ్యం.. ఫోన్ స్విచ్ ఆఫ్‌తో కుటుంబ సభ్యుల ఆందోళన.!

4
1K

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. 

ఇరివెంటి సాహితి అనే 21 ఏళ్ల యువతి ఈ నెల 27వ తేదీ ఉదయం నుంచి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో అల్వాల్ పోలీసులు మహిళ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పాత అల్వాల్‌లోని వెంకట సాయి అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న సాహితి డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది.

ప్రస్తుతం పరీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇంటి వద్దే ఉన్న ఆమె ఈ నెల 27వ తేదీ ఉదయం సుమారు 9:50 గంటల సమయంలో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చాలా సమయం గడిచినా తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.

మొదట బంధువులు, స్నేహితులు, సమీప ప్రాంతాల్లో గాలించినప్పటికీ యువతి ఆచూకీ లభించలేదు. అనంతరం ఆమె మొబైల్ ఫోన్‌కు పలుమార్లు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ వచ్చినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

దీంతో యువతి తల్లి మాధవి అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నంబర్ 519/2026 కింద మహిళ మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

పోలీసులు విడుదల చేసిన లుక్ అవుట్ నోటీసు ప్రకారం సాహితి ఎత్తు సుమారు 5 అడుగులు 6 అంగుళాలు ఉండగా, గుండ్రటి ముఖం, నల్ల జుట్టు కలిగి ఉంటుందని తెలిపారు. ఆమెకు తెలుగు, ఇంగ్లీష్ భాషలు తెలిసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై అల్వాల్ పోలీసులు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు రేడియో మెసేజ్ పంపించి గాలింపు చర్యలు చేపట్టారు.

యువతి ఆచూకీపై ఎవరైనా సమాచారం తెలిసిన వారు వెంటనే అల్వాల్ పోలీస్ స్టేషన్‌ను 8712663259 లేదా 8712554142 నంబర్లలో సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Uttarkhand
Uttarakhand Advances Renewable Energy and Hydropower
Uttarakhand continues to expand its renewable energy sector by promoting hydropower, solar...
By Fathima Safa 2026-06-27 06:47:51 0 73
Telangana
అవినీతి అధికారులను తొలగించండి : జిహెచ్ఎంసి ముందు బిజెపి నాయకుల ధర్నా
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ సర్కిల్ బిజెపి నాయకులు అల్వాల్ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా...
By Sidhu Maroju 2025-10-06 17:23:30 0 279
Prop News
India’s Real Estate Needs a New Standard. Propiinn Delivers It.
The Problem We’re Solving: Why India Needs a Platform Like Propiinn The Indian real estate...
By Bharat Aawaz 2025-06-25 18:49:01 0 2K
Andhra Pradesh
నందిగామలో "జలధార జలహారతి "కార్యక్రమం
నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన పెంపొందించడం ముఖ్య లక్ష్యం: మున్సిపల్ కమిషనర్ లోవరాజు నందిగామ,...
By Patan Khuddus 2026-04-18 10:41:46 0 580
Andhra Pradesh
చీరాలలో తెల్లవారుజామున దొంగల బీభత్సం
చీరాల: 8 సవర్ల బంగారు ఆభరణాలు అపహరణబాపట్ల జిల్లా, చీరాల మండల పరిధిలోని గాంధీనగర్ పంచాయతీలో ఉన్న...
By Gadiyapudi Narendra 2026-01-27 15:59:48 0 271
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com