స్వయంగా చేపలు కొని, గరిటె తిప్పి.. మత్స్యకార కుటుంబంతో చంద్రబాబు భోజనం.. ఫొటోలు ఇవిగో!.

0
115

కావలి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన

చేపల మార్కెట్ ను సందర్శించి స్వయంగా చేపలు కొనుగోలు చేసిన సీఎం

ఓ మత్స్యకారుడు ఇంటి చేపల కూరతో భోజనం

అందరితో పాటే కింద కూర్చుని భోజనం చేసిన చంద్రబాబు

ఆనందంతో పొంగిపోయిన మత్స్యకారుడి కుటుంబం  

ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం నాడు ఓ మత్స్యకార కుటుంబం ఇంట్లో సొంత కుటుంబ సభ్యుడిలా గడిపారు. స్వయంగా మార్కెట్‌లో చేపలు కొని, వారింటికి తీసుకెళ్లి, వంట చేస్తుండగా సరదాగా గరిటె తిప్పారు. ఆపై ఆ కుటుంబ సభ్యులతో కలిసి కింద కూర్చుని భోజనం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఆసక్తికర ఘటన నెల్లూరు జిల్లా కావలిలో చోటుచేసుకుంది.

 

వివరాల్లోకి వెళితే, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు తుమ్మలపెంట గ్రామానికి వెళ్లారు. అక్కడ 'మత్స్యకారుల సేవలో' కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం స్థానిక చేపల మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి మహిళా వ్యాపారుల నుంచి చేపలు కొనుగోలు చేశారు.

 

అనంతరం, మార్కెట్‌లో పరిచయమైన మత్స్యకారుడు తానంగారి బాబు ఆహ్వానం మేరకు సీఎం ఆయన ఇంటికి వెళ్లారు. తాను తెచ్చిన చేపలను వండమని తానంగారి బాబు భార్య వెంకమ్మకు ఇచ్చారు. ఆమె చేపల పులుసు వండుతుండగా, చంద్రబాబు అక్కడే ఉండి ఆసక్తిగా గమనించారు. కొద్దిసేపు ఆయన కూడా గరిటె తిప్పారు. వంట పూర్తయ్యాక, సీఎం చంద్రబాబు వారి కుటుంబ సభ్యులతో కలిసి కిందనే కూర్చుని భోజనం చేశారు. తన చేతులతో వారికి చేపల పులుసు వడ్డించడం విశేషం. తమ ఇంటికి వచ్చి, తమతో కలిసి భోజనం చేసిన ముఖ్యమంత్రికి తానంగారి బాబు కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.

Search
Categories
Read More
Nagaland
Five Tribal Groups Resume Sit-In Protest Over Reservation Policy
On July 9, the 5 Tribes Committee (representing Angami, Ao, Lotha, Rengma, and Sumi communities)...
By Bharat Aawaz 2025-07-17 07:52:29 0 2K
Uttarkhand
Uttarakhand Expands Healthcare Infrastructure Access
Uttarakhand has prioritized the expansion of healthcare infrastructure to improve medical...
By Fathima Safa 2026-06-16 12:24:10 0 176
Andhra Pradesh
Nara Lokesh: వైసీపీ విష ప్రచారాలను తిప్పికొట్టండి.
Nara Lokesh: వైసీపీ విష ప్రచారాలను తిప్పికొట్టండి: నారా లోకేష్ ndhra. Nara Lokesh Urges TDP to...
By Pagadala Venkateswar 2026-01-31 06:57:18 0 265
Telangana
డంప్ యార్డ్ తరలించాలి: ఈటల.|
"నిరసనకారుల అరెస్టులు సరికావని విమర్శ.. వెంటనే విడుదల చేయాలని డిమాండ్" మేడ్చల్...
By Sidhu Maroju 2026-07-11 09:49:22 0 170
Andhra Pradesh
మదనపల్లె: బాధితులకు ఆమోదయోగ్యమైన పరిహారం అందిస్తాం.
మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి బుధవారం మాట్లాడుతూ, జాతీయ రహదారి-71 (NH 71) విస్తరణలో భూములు...
By Pagadala Venkateswar 2026-05-28 05:23:45 0 100
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com