అంతర్రాష్ట్ర వాహన దొంగల ముఠాను చేదించిన సంగారెడ్డి జిల్లా పోలీసులు

0
200

సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ, నారాయణఖేడ్ పట్టణంలోని మనూర్ ఎక్స్ రోడ్ వద్ద తేది 09/10-04-2026 మధ్య రాత్రి డీసీఎం వాహనం దొంగతనం జరిగినట్లు తెలిపారు. ఈ విషయమై నాగల్‌గిద్ద గ్రామానికి చెందిన ఫిర్యాదుదారు మాలిపాటిల్ దత్తు తేది 11-04-2026న ఉదయం 10:15 గంటలకు ఫిర్యాదు చేయడం జరిగింది. తన డీసీఎం వాహనం (నంబర్: ఎపి 28 టిఇ 3708)ను 09-04-2026న మధ్యాహ్నం 12 గంటలకు డ్రైవర్ గైనీ సునీల్ మనూర్ ఎక్స్ రోడ్ వద్ద పార్క్ చేసి గ్రామానికి వెళ్లగా, మరుసటి రోజు రాత్రి 9 గంటలకు వాహనం కనిపించకుండా పోయినట్లు గుర్తించారు. ఈ మేరకు నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 84/2026, సెక్షన్ 305(బి) బిఎన్ఎస్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. 

‎*వివరాలలోని వెళితే:* జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, నారాయణఖేడ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు సేకరించి, తేది 03-05-2026 రాత్రి 9:30 గంటలకు నారాయణఖేడ్ పట్టణంలోని పంచగామ కమాన్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా వారు:

‎1. మహమ్మద్ ఖుర్షీద్ అహ్మద్ (వయసు 53, డ్రైవర్, కుత్‌కట్‌పల్లి, హైదరాబాద్) 

‎2. మహమ్మద్ జాఫర్ అలీ (వయసు 55, డ్రైవర్, చాంద్రాయణగుట్ట, హైదరాబాద్) 

‎వారి వద్ద నుండి 1 పిస్టల్ (2 రౌండ్స్), ఒక ఎయిర్ గన్, 2 కత్తులు స్వాధీనం చేసుకున్నారు.

‎ఈ ఇద్దరు వ్యక్తులు నదీమ్ ఖాన్, షేక్ ఐజాజ్, సయ్యద్ సయీద్, షేక్ నిజాం, మహమ్మద్ సలీం, మహమ్మద్ ఇర్షాద్ అహ్మద్, గులాం రబ్బానీ, సలావుద్దీన్, బాబా, మొహ్సిన్ షా, రేహాన్ తదితరులతో కలిసి గ్యాంగ్‌గా ఏర్పడి సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో వాహన దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు.

‎ఒక రాష్ట్రంలో వాహనాలను దొంగిలించి, మరో రాష్ట్రంలో విక్రయించడం ద్వారా పోలీసులను తప్పుదోవ పట్టించే విధంగా నేరాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది.

‎అరెస్ట్ చేయబడిన నిందితుల వివరాలు: మహమ్మద్ ఖుర్షీద్ అహ్మద్, మహమ్మద్ జాఫర్ అలీ, సయ్యద్ సయీద్, షేక్ నిజాం, మహమ్మద్ సలీం, మహమ్మద్ ఇర్షాద్ అహ్మద్ 

‎పరారీలో ఉన్న నిందితులు: నదీమ్ ఖాన్, షేక్ ఐజాజ్, గులాం రబ్బానీ, సలావుద్దీన్, బాబా, మొహ్సిన్ షా, రేహాన్. 

‎నిందితుల నుండి స్వాధీనం చేసిన సొత్తు: 

‎• 1-పిస్టల్ (2 రౌండ్స్)

‎• ఎయిర్ గన్

‎• కత్తులు – 2

‎• నగదు రూ. 2,00,000/-

‎• సెల్‌ఫోన్లు – 6

‎• టిప్పర్ వాహనం (ఎం.హెచ్ 22 ఎఎ 1413)

‎ఒప్పుకున్న కేసులు: మొత్తం 11 కేసులు (తెలంగాణ – 5, కర్ణాటక – 1, మహారాష్ట్ర – 5)లో వాహన దొంగతనాలు చేసినట్లు 

‎నిందితులు ఒప్పుకున్నారు.

‎గతంలో కూడా ఎ1- ఖుర్షీద్ అహ్మద్‌పై కర్ణాటక, హైదరాబాద్ పరిధిలో పలు వాహన దొంగతన కేసులు ఉన్నాయి.

‎A2 జాఫర్ అలీపై ఎన్.డి.పి.ఎస్ కేసులో జైలుకు వెళ్లిన చరిత్ర ఉంది.

‎అంతర్రాష్ట్ర వాహన దొంగల ముఠాను అరెస్టు చేసి, ఈ కేసును ఛేదించిన సిసిఎస్ సంగారెడ్డి బృందం, నారాయణఖేడ్ పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

‎ఈ ప్రెస్ మీట్ నందు అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్, ప్రసాద్ రావ్, నారాయణఖేడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ది గౌరి కో-ఆపరేటివ్ సొసైటీ 29వ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు
విశాఖపట్నం, అక్కయ్యపాలెం ప్రాంతంలోని 'ది శ్రీ గౌరి కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్' ఆధ్వర్యంలో...
By Santhosh Kumar 2026-09-13 10:08:05 0 142
SURAKSHA
Centre Approves ₹733 Crore Maharashtra Police Mega Plan
The Central Government has approved a landmark ₹733.28 crore modernization scheme to transform...
By Lokeshwari Panthadi 2026-07-04 07:40:17 0 179
Telangana
జిల్లా కలెక్టర్ ఈరోజు గ్రామసభలో దుగ్గొండి మండలంలో వరంగల్ జిల్లాలో
భారత్ అవాజ్ న్యూస్: 6జూన్ వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం ఈరోజు గ్రామసభవరంగల్ జిల్లా దుగ్గొండి మండల...
By Gujile Ramu 2026-06-06 08:08:12 0 197
Telangana
జనం కష్టమే తన కష్టంగా మురుగు సమస్యపై కార్పోరేటర్ మెరుపు తనిఖీ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  "ప్రజా క్షేమమే మా ప్రథమ లక్ష్యం " అని నినాదంతో...
By Sidhu Maroju 2026-01-21 08:28:34 0 234
BMA
Mesh Networks: Press Bypassing Internet Blackouts
When state authorities impose blanket internet shutdowns, journalists are turning to peer-to-peer...
By JoinBMA 2026-08-21 11:00:34 0 189
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com