బెజ్జం వజ్రం హత్యపై జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ. హైదరాబాదులో విచారణ జరిపిన ఎస్సీ కమిషన్ నెంబర్డై,రెక్టర్లు

0
392

14 సంవత్సరాల క్రితం చీరాలలో జరిగిన బెజ్జం వజ్రమ్మ అను ఎస్సీ మహిళ హత్య కేసులో పునర్విచారణ జరపాలని ఎస్సీ, ఎస్టీ యాక్ట్ వేయాలని ఫిర్యాదు పై హైదరాబాదులో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు మరియు డైరెక్టర్లు శుక్రవారం విచారణ జరిపారు. 2012 వ సంవత్సరం జూన్ నెల 12వ తేదీన చీరాల రెడ్డి గారి బంగ్లా వద్ద నివాసం ఉండే పర్చూరు మండలం చిన్నంబొట్ల అగ్రహారం గ్రామానికి చెందిన బెజ్జం వజ్రం లక్ష్మీ మహిళా మండలి వికలాంగుల ఉచిత ఒకేషనల్ సెంటర్ నందు ట్రైనర్ గా పనిచేస్తుంది. ఈ క్రమంలో కసిరెడ్డి సుధాకర్ రెడ్డి తన తల్లిదండ్రులతో కలిసి రోకలిబండతో కొట్టి చంపేశారు. శవాన్ని చీరాల గవర్నమెంట్ హాస్పటల్ తీసుకుని వెళ్లి కూడా మరలా శవాన్ని వెనుకకు తీసుకొచ్చి సాక్షాదారాలు లేకుండా కసిరెడ్డి సుధాకర్ రెడ్డి బంధువులు వజ్రం శవాన్ని తగలబెట్టారు. నెల నెల ఊరికి వచ్చి పెన్షన్ తీసుకునే వజ్రమ్మ ఐదు నెలలైనా ఊరికి రాకపోవడంతో సోదరుడు రత్నకుమార్ చీరాల వెళ్లి విచారించగా వజ్రమ్మను చంపేశారని తెలిసి 2012 సంవత్సరం నవంబర్ 11వ తేదీన చీరాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ హత్య క్రైమ్ నెంబర్ సి ఆర్ పి సి 286 /2012గా చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదయింది.ఎస్సీ కులానికి చెందిన తన సోదరి బెజ్జం వజ్రం ను రెడ్డి కులానికి చెందినవారు హత్య చేశారని ఫిర్యాదు చేస్తే చీరాల పోలీస్ వారు హంతకులను రక్షించటానికి సి ఆర్ పి సి.174 అనుమానస్పద మరణంగా కేసు నమోదు చేశారు . తరువాత బాధితులు ఆందోళనతో హత్య కేసుగా మార్చారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన చీరాల సర్కిల్ ఇన్స్పెక్టర్ గాంధీ మరణించారు. తర్వాత 2016 వ సంవత్సరం లో చీరాల సర్కిల్ ఇన్స్పెక్టర్లైన భీమా నాయక్ ఎస్సీ కులానికి చెందిన మహిళను ఓసి రెడ్డి కులానికి చెందిన కసిరెడ్డి సుధాకర్ రెడ్డి కుటుంబం హత్య చేసి శవాన్ని మాయం చేస్తే ఎస్సీ ఎస్టీ యాక్ట్ వేయకుండానే కోర్టులో చార్జి సీట్ ఫైల్ వేశారు .ఈ కేసు విచారణ ఒంగోలు మొదటి అదనపు జిల్లా న్యాయస్థానం నందు విచారణకు వచ్చింది. ఎస్సీ కులానికి చెందిన తన సోదరి వజ్రం హత్య కేసులో చట్ట ప్రకారం ఎస్సీ ఎస్టీ యాక్ట్ వేసి విచారణ కొరకు జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టుకు పంపాలని సోదరుడు బెజ్జం రత్నకుమార్ జిల్లా మొదటి అదనపు న్యాయాధికారికి ఫిర్యాదు చేసినారు. అంతట ఎస్సీ ఎస్టీ కోర్టు ఇంచార్జ్ స్పెషల్ పబ్లిక్ పాజిటివ్ గా ఉన్న 

వై. కొండారెడ్డి 2017 సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీన ఎస్సీ మహిళను రెడ్డి కులం వారు చంపితే ఎస్సీ ఎస్టీ ఆక్ట్ రాదని న్యాయ కోవిదుడు రాజ్యాంగ నిపుడైన వై. కొండారెడ్డి లీగల్ ఒపీనియన్ ఇచ్చాడు. మహిళను చంపిన ముద్దాయి కులానికి చెందిన కొండారెడ్డి ఇచ్చిన ఒపీనియన్ చట్ట విరుద్ధమని ఎస్సీ కులానికి చెందిన మహిళ ఇతర కులానికి చెందినవారు హత్య చేస్తే ఎస్సీ ఎస్టీ ఆక్ట్ 3(2) v వేయాలని ఎస్సీ ఎస్టీ యాక్ట్ చైర్మన్ అయినా ప్రకాశం జిల్లా కలెక్టర్ కి దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు పిర్యాదు చేశారు. నీలం నాగేంద్రరావు ఫిర్యాదు పై జిల్లా కలెక్టర్ స్పందించి లీగల్ ఒపీనియన్ కోరగా ఈ కేసును రీ చేసి మరలా విచారణ జరపాలని 3(2)v ఎస్సీ ఎస్టీ యాక్ట్ రూల్స్ సెవెన్ ప్రకారం డి.ఎస్.పి ఈ కేసును విచారణ జరపాలని 2020 వ సంవత్సరం మార్చి 17వ తేదీన తెలిపి ఉన్నారు. అయినా ఈ కేసులో ఎస్సీ ఎస్టీ ఆక్టివేయలేదు. సంబంధిత విచారణ జరుగుతున్న కోర్టు వారు కూడా ఈ కేసును ఎస్సీ ఎస్టీ కోర్టుకు పంపలేదు. నలుగురు న్యాయాధికారులు మారిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాతపూర్వకంగా రాసిచ్చిన విచారణ అధికారిని మార్చలేదు. కేసు మరలా విచారణ చేయలేదు. కనీసం ఎస్సీ ఎస్టీ కోర్టు కూడా మార్చలేదు. మరల దళిత నాయకులు నీలం నాగేందర్రావు చీరాల డిఎస్పి ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఈ కేసులో మేము వేయలేదని ఫిర్యాదు చేసి మరల జిల్లా పబ్లిక్ పాజిక్యూటర్ ద్వారా లీగల్ ఒపీనియన్ తెప్పించి హత్తురాలి సోదరుడు బెజ్జం రత్నం కుమార్ కు మంజూరు చేయాలని ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ ఈ కేసులో ఎస్సీ ఎస్టీ యాక్ట్ వర్తిస్తుందా లేదా అని ప్రకాశం జిల్లా ఎస్పీ ని కూడా రాతపూర్వకంగా కోరి ఉన్నారు. పబ్లిక్ పాజిక్యూటర్ కోర్టులో వేసిన పిటీషన్ కూడా అగ్రకుల రెడ్డి అంతగా అరాచక గణం కోర్టులో కనపడకుండా చేశాడు. ఇంతలో జిల్లాల పునర్విభజన జరిగింది కాబట్టి చీరాల బాపట్ల జిల్లాకు వెళ్లింది కాబట్టి బాపట్ల జిల్లా కలెక్టర్ దగ్గర సమస్య పరిష్కరించుకోమని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఎండార్స్మెంట్ ఇచ్చాడు. అంతట దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అంతట హైదరాబాదులోని దిల్ కుష్ ప్రభుత్వ అతిథి గృహంలో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డే రామచందర్రావు డైరెక్టర్ సునీల్ కుమార్ హత్య కేసు పై విచారణ జరిపారు. ఈ విచారణకు హాజరైన బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ బెజ్జం వజ్రమ్మ హత్య కేసు ఎస్సీ ఎస్టీ యాక్టు వేయటానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని కానీ ఈ కేసు కోర్టు విచారణ జరుగుతున్నందున కోర్టు వారు నిర్ణయం తీసుకోవాలని కమిషన్ కు తెలిపారు. పోలీస్ అధికారులతో పాటు వచ్చిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పద్మజ ఈ కేసులో తాము కూడా కోర్టులో పిటిషన్ వేసామని, జడ్జి నిర్ణయం తర్వాతనే ఈ కేసు పై ముందుకు వెళ్తామని ఎస్సీ ఎస్టీ కోర్టుకు ఈ కేసును పంపించే నిర్ణయం తమది కాదని కమిషన్ కు తెలిపారు. గంటసేపు సాగిన ఈ విచారణలో కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వరును స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పద్మజాను 14 సంవత్సరాలుగా దళిత మహిళల హత్య చేసి శవాన్ని మాయం చేసిన కేసులో పోలీసు వైఫల్యం పై పలు ప్రశ్నలు వేశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగకుండా లీగల్ ఒపీనియన్ కూడా రకరకాలుగా ఇవ్వటాన్ని తప్పుపట్టారు. కులం ప్రస్తావన లేదని భార్యాభర్తలని కోర్టులో చెప్పిన ఎదురు సాక్షులు కూడా కుల ప్రస్తావన చెప్పలేదని అధికారులు స్పెషల్ పబ్లిక్ ప్రాజిక్యూటర్ చెప్పిన వైఖరిపై ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డే రామచంద్రరావు మండిపడ్డారు. నెల రోజుల్లో ఈ కేసులో ఎస్సీ ఎస్టీ యాక్ట్ గా మార్చి కోర్టుకు పంపాలని ఆదేశించారు. ప్రస్తుతం కేసు కోర్టు విచారణలో ఉన్నందున తాము సొంత నిర్ణయం తీసుకోలేమని కోర్టు న్యాయ అధికారిని మరియు ఉన్నతాధికారులను సంప్రదించి నిర్ణయం తీసుకోవడానికి రెండు నెలలు సమయం కావాలని బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ కమిషన్ కోరారు. రెండు నెలల లోపల బెజ్జం వజ్రం కేసులో పునర్విచారణ ఎస్సీ ఎస్టీ ఆక్ట్ వెయ్యాలని బెజ్జం వజ్రం కేసును మే నెలకు వాయిదా వేశారు. విచారణ సమయంలో బెజ్జం వజ్రం సోదరుడు రత్నకుమారుతో పాటు దళిత నాయకులు నీలం నాగేంద్రరావు, తెలంగాణ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అధ్యక్షులు బత్తుల రాంప్రసాద్, సామాజిక ఉద్యమకారులు ప్రొఫెసర్ జివి రత్నాకర్, తదితరులు ఉన్నారు.

Search
Categories
Read More
Jharkhand
Jharkhand Accelerates Urban Development Projects in 2026
Jharkhand has continued to strengthen urban development in 2026 through investments in smart...
By Fathima Safa 2026-07-01 09:59:48 0 175
Andhra Pradesh
నెల్లూరులో నేటి నుంచి ‘రొట్టెల పండుగ’.
  నెల్లూరులో నేటి నుంచి ‘రొట్టెల పండుగ’ 26-06-2026 Fri Andhra స్వర్ణాల...
By Pagadala Venkateswar 2026-06-26 05:23:36 0 91
Andhra Pradesh
పుంగనూరు: ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలి: సిపిఐ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలంలో మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యాన్ని నిరసిస్తూ, నిందితుడికి కఠిన...
By Kothuru Murali 2026-04-06 07:13:47 0 189
Tripura
Tripura's E-Governance Drive Transforming Public Services
Tripura is accelerating its digital governance and e-governance initiatives to make public...
By Fathima Safa 2026-06-25 09:25:42 0 102
Business & Finance
Karnataka’s MSIL Enters Digital Chit-Fund Market
Mysore Sales International Ltd (MSIL) is revamping its ₹500 cr chit-fund operations via a new...
By Bharat Aawaz 2025-06-26 11:45:14 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com