శ్రీకాకుళం నిరుద్యోగులకు స్వర్ణవకాశం

0
215

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని అభ్యుదయ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 31న ఉదయం 9 గంటల నుంచి జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ బుధవారం తెలిపారు. టెక్‌ మహీంద్రా, డాక్టర్‌ రెడ్డీస్‌, స్కిల్‌ దునియా, ప్రెస్‌మీన్‌ హెచ్‌ఆర్‌ సొల్యూషన్స్‌, నాగార్జున అగ్రికెమ్‌, కాన్సెంట్రిక్స్‌ ఫార్మా, పీఎంజే జ్యూయలరీ, జాయ్‌ అలుక్కాస్‌, డెక్కన్‌ కెమికల్‌, ఐ స్మార్ట్‌ సొల్యూషన్‌ వంటి ప్రముఖ సంస్థలు పాల్గొని 500పైగా ఉద్యోగాలు కల్పిస్తాయని వివరించారు. టెన్త్‌, ఇంటర్మీడియట్‌, ఐటీఐ, డిప్లమో, బీటెక్‌, ఎంబీఏ, డిగ్రీ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివిన 18 నుంచి 30 ఏళ్ల నిరుద్యోగ యువతీ యువకులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన వారు శ్రీకాకుళం, విశాఖపట్నం, శ్రీసిటీ నెల్లూరు, హైదరాబాద్‌లలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు naipunyam.ap.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికా రి ఉరిటి సాయికుమార్‌ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్‌ రిఫరెన్స్‌ నంబర్‌, బయోడేటా, ఆధార్‌, విద్యార్హతల ఒరిజినల్‌, జెరాక్స్‌ కాపీలు, పాస్‌పోర్ట్‌ సైజు ఫొ టోతో కలిసి ఉదయం 9 గంటలకు జాబ్‌మేళా ప్రాంగణానికి హాజరుకావాలని, వివరాలకు 95509 67353 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నారా లోకేష్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన రాయచోటి తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్ బెంగళూరు మధుబాబు
రాయచోటి తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్ బెంగళూరు మధుబాబు బుధవారం రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ...
By Benguluri Madhubabu 2026-06-17 11:35:32 0 130
Andhra Pradesh
ఏనుగులు ధ్వంసం చేసిన మొక్కజొన్న పరిశీలన
బొబ్బిలి మండలం శివడవలసలో ఏనుగుల గుంపు ధ్వంసం చేసిన మొక్కజొన్న పంటను మండల వ్యవసాయ శాఖాధికారి మజ్జి...
By Boiena Rajesh 2026-08-10 09:54:41 0 142
Andhra Pradesh
పౌర సరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్
మీడియా పాయింట్...  పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ..   ఆంధ్రప్రదేశ్...
By Rajini Kumari 2026-02-14 15:05:42 0 261
BMA
Media Restructuring: Widespread Layoffs Hit Newsrooms
The year 2026 has witnessed aggressive corporate restructuring within the media sector, resulting...
By JoinBMA 2026-08-20 08:03:49 0 171
Andhra Pradesh
చింతూరు ఐటిడిఏ ముందు గిరిజనుల ధర్నా!
పోలవరం జిల్లా కేంద్ర రంపచోడవరంలో ఈరోజు  గిరజన చట్టాల సాధనకై జరుగుతున్న మహాగర్జన సభకు...
By Shyamala Yadagiri 2026-07-20 06:59:43 0 194
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com