నల్లమోతువారిపాలెం గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన సంతోష దాయకం..... ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు*

0
769

బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయుటకు విచ్చేసిన బాపట్ల శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు కి ఆ సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు పుష్పగుచ్ఛాన్ని అందించి స్వాగతం పలికారు.  

షుమారు 10 లక్షల రూపాయలు గ్రామంలో సిమెంట్ రోడ్లు కొరకు అదేవిదంగా మరో 7 లక్షల రూపాయల (షుమారుగా) నిధులను హిందూ స్మశాన వాటిక అభివృద్ధి కొరకు కేటాయించినందుకు ఆ గ్రామ ప్రజా ప్రతినిధిగా గ్రామస్తులు అందరి తరుపున శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు కి ధన్యవాదాలు తెలియ జేస్తున్నట్లు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు తెలిపారు.  

గ్రామభివృద్ధి కోసం నిధులు కేటాయించినందుకు తాండ్ర సంతోషాన్ని వ్యక్త పరుస్తూ, కుల మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా ఇలాంటి అభివృద్ధి పనులను ప్రతి ఒక్కరూ స్వాగతించాలి అని కోరారు. శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ పరిశీలకులు బొంతు శివ సాంబి రెడ్డి తో పాటు ప్రతి ఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలియ జేసిన ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు.  

కార్యక్రమంలో కర్లపాలెం తశీల్దార్ శ్రీదేవి, ఎంపిడిఓ అద్దూరి శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపిడిఓ లు శ్రీనివాసరావు,పద్మావతి లు, సెక్రెటరీ షేక్ షాహిన్, జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, ఉపసర్పంచ్ మర్రి ఆషా అశోక్, టీడీపీ యూనిట్ ఇంచార్జి మాడా శ్రీనివాసరావు, టీడీపీ, జనసేన గ్రామ పార్టీ ఇంచార్జ్ లు మునిపల్లి చిన్నా, గరిగంటి శ్రీనివాసరావులు, కుంటా రత్న బాబు,తాండ్ర శేషగిరి, బీసాబతుని గోపి, తాండ్ర శ్రీనివాసరావు,మొదలగు గ్రామ పెద్దలు, గ్రామస్తులు మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
BMA
Eco-Acoustics: Soundscapes Exposing Illegal Logging
Environmental journalists are deploying autonomous acoustic sensors deep within protected forests...
By JoinBMA 2026-08-21 18:20:53 0 336
Telangana
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఆసిఫాబాద్ విద్యార్థులు ఎంపిక ప్రిన్సిపల్ దుర్గం మహేశ్వర్ అభినందనలు
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ ప్రతినిధి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన క్రీడా పాఠశాలలో...
By Chunarkar Jagadeesh 2026-08-25 00:02:09 0 416
Madhya Pradesh
MP High Court Sets Strict Timeline for Public Event Permits
In a significant ruling concerning the Indore Muharram procession, the Madhya Pradesh High Court...
By Lokeshwari Panthadi 2026-06-27 08:12:15 0 78
Andhra Pradesh
ఇఫ్తార్ విందులో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు సుగువాసి ప్రసాద్ బాబు
రాయచోటి పట్టణం కొత్తపేట ముస్తఫా వీధిలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం...
By Benguluri Madhubabu 2026-03-08 13:24:57 0 236
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com