అంగన్వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఎలిజిబెత్ రేఖ ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ బాపట్ల జిల్లా కార్యదర్శి(సి.ఐ.టి.యు)

0
377

బాపట్ల జిల్లా: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చి కార్మికులను వీధుల పాలు చేసిందని అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని హామీలిచి నెరవేర్చకుండా ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ బాపట్ల లోని ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) మంగళవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షల్లో అంగన్వాడీలు కూర్చొన్నారు.అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని గత ప్రభుత్వ హయాంలో 42 రోజుల పాటు సమ్మె నిర్వహించినట్లు తెలిపారు. ఆ సమయంలో కూటమి నాయకులు అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే అంగన్వాడీల జీతాలు, పెంచుతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచినా ఇంత వరకూ ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు.అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణతో వ్యవహరిస్తుందని విమర్శించారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలన్నారు. వేసవి సెలవుల జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

సిఐటియు బాపట్ల జిల్లా కార్యదర్శి సి.హెచ్.మజుందార్ మాట్లాడుతూ...
 
ఐదు సంవత్సరంలోపు పిల్లలు
విధిగా అంగన్వాడీ స్కూల్లో చదివేలా జీవో విడుదల చేయాలన్నారు. అంగన్వాడీలకు నేతనంతో కూడిన మెడికల్ లీవులు మంజూరు చేయాలన్నారు. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. హెల్పర్ల ప్రమోషన్లో రాజకీయ జోక్యం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు బాపట్ల కన్వీనర్ శరత్ అంగన్వాడి ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు నాయకులు కార్యకర్తలు శైలశ్రీ,హేమమాలిని, సీతామహాలక్ష్మి,హైమా,శ్రీలత,బేబీ రాణి,భారతి,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
నేలకొండపల్లి లో కొనసాగుతున పోలింగ్...!
మండలం లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే కాగా పళ్ళు కేంద్రాలు వద్ద ఉదయం 7: 00...
By Krishna Balina 2025-12-14 05:46:43 1 521
Andhra Pradesh
ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు – జిల్లా ఎస్పీ.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల...
By Pagadala Venkateswar 2026-02-02 12:24:16 0 176
Andhra Pradesh
ఆసియా యూనివర్సిటీ ఛాంపియన్షిప్ లో రజిత పథకం క్రీడాకారుడికి మంత్రి చేతుల మీదుగా ఘన సత్కారం
థాయిలాండ్ దేశంలో పట్టం కానీ నగరంలో మార్చి 26 నుంచి 30 వరకు నిర్వహించిన రెండవ ఆశ యూనివర్సిటీ...
By Benguluri Madhubabu 2026-04-02 11:08:32 0 239
Andhra Pradesh
అనంతపురం: మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
ప్రజల ప్రాణాల భద్రతే లక్ష్యం... జిల్లా అంతటా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు  జిల్లా ఎస్పీ శ్రీ పి....
By Eslavath RameshNaik 2026-01-23 11:22:02 0 631
Telangana
"ఖరీదైన దాహం"... వృద్ధురాలి గొలుసు లాక్కెళ్ళిన కేటుగాడు కటకటాల్లోకి..|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మంచినీళ్ల పేరుతో నమ్మించి వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు...
By Sidhu Maroju 2026-02-13 15:31:33 0 244
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com