బీసీల అభ్యున్నతికి ఐలాపురం వెంకయ్య చేసిన సేవలు చిరస్మరణీయం

0
202

*ప్ర‌చుర‌ణార్ధం* *23-02-2026*

 

బిసిల‌ అభ్యున్నతికి ఐలాపురం వెంక‌య్య‌ చేసిన సేవలు చిరస్మరణీయం

 

ఐలాపురం వెంక‌య్య కుటంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్

 

వెంక‌య్య కుటుంబానికి ఎంపీ కేశినేని శివ‌నాథ్ ప్రగాఢ సానుభూతి

 

 

విజ‌య‌వాడ : ఇటీవ‌ల మృతి చెందిన ప్రముఖ బీసీ నాయకుడు, వ్యాపార‌వేత్త‌, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య (96) కుటుంబ సభ్యుల్ని ఎంపీ కేశినేని శివనాథ్ సోమ‌వారం పరామర్శించారు. దుర్గా ఆగ్ర‌హ‌రంలోని ఆయ‌న నివాసానికి వెళ్లి ఆయ‌న కుమారులు ఐలాపురం రాజ‌, ఐలాపురం అరుణ్ కుమార్ ల‌తో పాటు ఇత‌ర కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియపర్చి,ఐలాపురం వెంకయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ సందర్బంగా వ్యాపార‌వేత్త‌గా హోట‌ల్ రంగంలో, బీసీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీగా ఆయ‌న చేసిన సేవ‌ల‌ను ఎంపీ కేశినేని శివ‌నాథ్ కొనియాడారు. బీసీ వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమ‌న్నారు.

 

ఈ కార్య‌క్ర‌మంలో టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప‌రుచూరి ప్ర‌సాద్, ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి కో-ఆర్డినేట‌ర్ వ‌ల్ల‌భ‌నేని న‌ర‌సింహాచౌద‌రి, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజ‌య్ వ‌ర్మ‌, టి.ఎన్.ఎస్.ఎఫ్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చ‌ర‌ణ్ సాయి ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లెలో 25 వేల హెక్టార్లకు పైగా టమాటా సాగు.
మదనపల్లె మార్కెట్‌కు సమీపంలో ఉన్న ఉమ్మడి చిత్తూరు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల రైతులు సుమారు...
By Pagadala Venkateswar 2026-02-04 07:27:39 0 199
Andhra Pradesh
పుంగునూరు: విద్యార్థులకు నోట్ బుక్ లు పంపిణీ.
పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జి చల్లా బాబు రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని...
By Kothuru Murali 2026-01-24 08:01:48 0 227
Andhra Pradesh
Andhra Pradesh: ఏపీలో ఈవీ విప్లవం.. తొలిదశలో 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు.
  Andhra Pradesh: ఏపీలో ఈవీ విప్లవం.. తొలిదశలో 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు...
By Pagadala Venkateswar 2026-03-10 08:53:16 0 191
Andhra Pradesh
ముగతి గ్రామ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు ఓటర్ వెరిఫికేషన్ చేయించుకోవాలని తెలియజేశారు
ముగతి గ్రామంలో బీసీ కాలనీ లో SRI కార్యక్రమంలో భాగంగా BLO తో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు...
By Boya Dasthagiri 2026-06-19 14:14:37 0 194
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com