ఎంఎస్ బేగ్ ని కలిసిన నవ్యాంధ్ర రచయిత సంఘం నాయకులు

0
186

*ఎంఎస్ బేగ్ ను కలిసిన నవ్యాంధ్ర రచయితల సంఘం నాయకులు*

 

విజయవాడ పశ్చిమ

ఫిబ్రవరి 21 :

 

 

ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే నియమింపబడిన ఎం.ఎస్.బేగు ని నవ్యాంధ్ర రచయితల సంఘం నాయకులు శనివారం ఉదయం విజయవాడ భావానిపురం లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఛైర్మన్ గా నియమింపబడిన తర్వాత అధికారికంగా ఠాగూర్ గ్రంథాలయంలో జరిగే ఒక పుస్తకావిష్కరణ సభకు తొలిసారిగా హాజరవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని బేగ్ ను నవ్యాంధ్ర రచయితల సంఘం నాయకులు శాలువాతో సత్కరించి, పుస్తకాలను జ్ఞాపికలుగా అందించారు. ఈ సందర్భంగా రచయితలకు గ్రంథాలయాలకు వున్న అనుబంధాన్ని ఆయనకు వివరించారు. అనంతరం బేగ్ మాట్లాడుతూ- గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ నాయకత్వంలో అమరావతిలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఎన్నో వసతులతో ఉన్నతంగా వేగంగా నిర్మాణం జరగబోతుందన్నారు. ఈ లైబ్రరీలో పుస్తకాలను డిజిటలైజ్ చేసే గొప్ప సౌకర్యం వుండబోతుందన్నారు. రచయితలకూ గ్రంథాలయాలకు మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేకుండా సామరస్యభావంతో అభివృద్ధి దిశగా అడుగులేద్దామని అన్నారు. అందుకు రచయితల సంఘాలు జర్నలిస్టు సంఘాలు తోడ్పాటునందించాలన్నారు. ఎం.ఎస్.బేగ్ ను కలిసిన వారిలో నవ్యాంధ్ర రచయితల సంఘం జనరల్ సెక్రెటరీ కలిమిశ్రీ, అభివృద్ధి కమిటీ కన్వీనర్ యేమినేని వెంకట రమణ, కోశాధికారి చొప్పా రాఘవేంద్రశేఖర్, జిల్లా నాయకులు విష్ణుభొట్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు...

Search
Categories
Read More
Telangana
"లక్నోలో తెలంగాణ పోలీసుల జోష్.. 12 పతకాలతో జాతీయ స్థాయిలో సత్తా!
హైదరాబాద్ : లక్నోలో నిర్వహించిన 2వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాడ్మింటన్ & టేబుల్ టెన్నిస్ క్లస్టర్...
By Sidhu Maroju 2026-05-23 08:24:41 0 315
Technology
US and Philippines Fast-Track 4,000-Acre AI Hub
The United States and the Philippines are rapidly advancing plans to construct a massive...
By Dunna Jessicaruth 2026-05-18 12:06:07 0 142
Telangana
నిజామాబాద్
"ప్రజా సమస్యే ప్రధాన ఎజెండా... చొరవ మీది, పరిష్కారం మున్సిపాలిటీది!"అక్షర భారతి స్కూల్ సమీపంలో గత...
By Sadaq Sadaq 2026-07-29 06:30:23 0 150
Andhra Pradesh
పుంగనూరు: ఫల అలంకారంలో దర్శనమిచ్చిన మారెమ్మ
పుంగనూరు పట్టణ ప్రజల కల్పవృక్షంగా విరాజిల్లుతున్న శ్రీ విరూపాక్షి మారెమ్మ శుక్రవారం సందర్భంగా,...
By Kothuru Murali 2026-05-08 14:22:52 0 162
Andhra Pradesh
హత్య కేసులోనే ముద్దాయిను అరెస్టు చేసిన మార్కాపురం జిల్లా పోలీసులు
హత్య కేసులోనే ముద్దాయిను అరెస్టు చేసిన మార్కాపురం జిల్లా పోలీసులు క్రైమ్ నెంబర్:- 06/2026 U/s...
By Chennaiah Kati 2026-01-28 02:52:29 0 236
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com