అత్తాపూర్ పీఎస్ 2017 నాటి సంచలనాత్మక హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ గౌరవ న్యాయస్థానం తీర్పు
హైదరాబాద్; అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంచలనాత్మక హత్య కేసు (Cr. No. 737/2017 U/s 302, 201 IPC; SC No. 974/2019) లో నేడు (17-07-2026), రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని గౌరవ X అడిషనల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జ్ (ADJ) కోర్టు కీలక తీర్పు వెల్లడించింది.
నేరం నిరూపితమవడంతో నిందితుడైన నిసార్ అహ్మద్‌కు గౌరవ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష (LIFE IMPRISONMENT) రూ. 15,000/- జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
శిక్ష పడిన నిందితుడి వివరాలు:పేరు: నిసార్ అహ్మద్, తండ్రి: లేట్ సిరాజ్ అహ్మద్,వయస్సు & వృత్తి: 40 సంవత్సరాలు, లెదర్ (చర్మం) వ్యాపారం,చిరునామా: డోర్ నెం. 19, 1వ అంతస్తు, 1వ మెయిన్ రోడ్, 3వ క్రాస్ రోడ్, బెంగళూరు - 46, కర్ణాటక రాష్ట్రం.
మృతుడి వివరాలు:పేరు: నీసార్ అహ్మద్, వయస్సు: 35 సంవత్సరాలు, వృత్తి: లెదర్ వ్యాపారం, నివాసం: బెంగళూరు నగరం.
కేసు సంక్షిప్త వివరాలు: హైదరాబాద్ మెహదీపట్నం, సంతోష్ నగర్ కాలనీ (H.No. 12-2-823/A/158/3) నివాసి, రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన శ్రీ మహ్మద్ అబ్దుల్ వహీద్ (74 సం.లు, తండ్రి: మహ్మద్ అబ్దుల్ కరీం) 24-04-2017 రోజున మధ్యాహ్నం 12:30 గంటలకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఇంగ్లీష్‌లో ఒక లిఖితపూర్వక ఫిర్యాదును అందించారు. ఫిర్యాదుదారునికి హైదరాబాద్ నగరంలో దాదాపు 50 ఫ్లాట్లు ఉన్నాయి.
19-04-2017న ఫిర్యాదుదారుడు మొయినాబాద్‌లోని తన ఫామ్‌హౌస్‌లో ఉన్నప్పుడు, రెంటల్ బ్రోకర్ లతీఫుద్దీన్ ఫోన్ చేసి, ఇద్దరు వ్యక్తులు మెహదీపట్నంలో అద్దెకు ఫ్లాట్ కావాలని అడుగుతున్నట్లు తెలిపాడు. దానిపై సంతోష్ నగర్ కాలనీలోని 'సాజిద్ రెసిడెన్సీ' లో ఉన్న ఫ్లాట్ నెం. 105ను నెలకు రూ. 10,000/- అద్దెకు మాట్లాడారు.
తమను తమిళనాడు వెల్లూరు జిల్లాకు చెందిన ఇంతియాజ్ (45 సం.), బెంగళూరుకు చెందిన నీసార్ అహ్మద్ (35 సం.) గా పరిచయం చేసుకున్న ఆ ఇద్దరు లెదర్ వ్యాపారులు, 19-04-2017 రాత్రి 19:00 గంటలకు ఫ్లాట్‌లోకి దిగారు. అనంతరం 20-04-2017 సాయంత్రం నిందితుడు నిసార్ అహ్మద్ ఫ్లాట్‌కు తాళం వేసి పరారయ్యాడు.
24-04-2017న అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ ధర్మేంద్ర ఫ్లాట్ నెం. 105 నుండి దుర్వాసన వస్తోందని యజమానికి సమాచారం ఇచ్చాడు. ఫిర్యాదుదారుడు బ్రోకర్ లతీఫుద్దీన్, వాచ్‌మెన్‌తో కలిసి వచ్చి తాళం తెరిచి చూడగా, బాత్రూమ్‌లో కుళ్ళిపోయిన స్థితిలో నీసార్ అహ్మద్ శవం కనిపించింది.
మృతుడి నుదుటిపై రాయితో కొట్టిన తీవ్ర గాయాలు ఉన్నాయి, అలాగే మెడకు తాడు చుట్టి ఉంది. వ్యాపార వివాదాల కారణంగానే నిందితుడు నిసార్ అహ్మద్ ఈ దారుణ హత్యకు పాల్పడినట్లు తేలింది. ఆ తర్వాత నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
పోలీస్ ,ప్రాసిక్యూషన్ బృందానికి అభినందనలు:
ఈ కేసులో పక్కా ఆధారాలతో దర్యాప్తు చేసి, నిందితుడికి శిక్ష పడేలా శ్రమించిన పోలీస్ , ప్రాసిక్యూషన్ బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.
దర్యాప్తు అధికారి (IO): జి. సురేష్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ స్టేషన్ హౌస్ అధికారి (SHO): ఎ. సీతయ్య, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అత్తాపూర్ పీఎస్ (ఫోన్: 8712663410)
• పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (PP): టి. వెంకటేశ్వర ప్రసాద్, & పి. కృష్ణమూర్తి (ఫోన్: +919247289390)
1. కోర్టు డ్యూటీ అధికారులు (CDO): ఎ. అమృత, WASI 4732 ,వెంకటేష్ చారి, PC 6062
• సమన్స్ విభాగం: పి. ప్రవీణ్ కుమార్, HG 986
• లైజన్ అధికారులు: ఎస్. నరసింహులు, PC 4384 & జి. శివరెడ్డి, ASI.