చిన్నారి కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి.
మదనపల్లిలో ఏడేళ్ల చిన్నారిపై జరిగిన అమానుష ఘటనపై ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం కొండామరిపల్లి గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన, బాధితురాలి కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ కుటుంబానికి అండగా నిలబడ్డ వారిపై కేసులు నమోదు చేయడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.
0 Comments 0 Shares 10 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com