మదనపల్లి: స్కూటర్ ఢీకొని రైతుకు తీవ్ర గాయాలు.
గురువారం రాత్రి మదనపల్లి మండలం చీకిల బైలులో రోడ్డు దాటుతున్న గురికాని నారాయణస్వామి (55)ని ఓ స్కూటర్ వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తులు వెంటనే స్పందించి నారాయణస్వామిని మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు చికిత్స అందించగా, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని తెలిపారు.
0 Comments 0 Shares 40 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com