నగల దుకాణంలో దొంగతనంలో చోరి - ఘటన స్థలంలోనే FIR నమోదు చేసిన పోలీసులు. |
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఒక నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
శుక్రవారం తెల్లవారుజామున ఉదయం 6 గంటల సమయంలో డయల్ -100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు అందింది. టెంపుల్ అల్వాల్ లోని శ్రీకృష్ణ రెసిడెన్సి నివాసి, స్వర్ణకారుడైన వరుగంటి సురేష్ కుమార్ తన దుకాణంలో దొంగతనం జరిగినట్టు సమాచారం అందించారు. ...