దీపావళి పండుగ సందర్భంగా చింతూరు డివిజన్ పరిధిలో బాణసంచా విక్రయ దుకాణాలు ఏర్పాటు చేయాలనుకునే వ్యాపారులు సంబంధిత శాఖల నుంచి తప్పనిసరిగా ముందస్తు అనుమతులు, లైసెన్సులు పొందాలని చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శ్రీ చిట్టపులి నరేంద్ర పడాల్, ఐఏఎస్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలందరూ దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో పాటు సురక్షితంగా జరుపుకునేలా బాణసంచా విక్రయదారులు, సంబంధిత శాఖల...