ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్):కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన మహిళల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధే లక్ష్యంగా రాజేంద్రనగర్‌లోని పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయంలో నిర్వహించిన మూడు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
టాటా ట్రస్ట్స్ మరియు పశువైద్య విశ్వవిద్యాలయ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణా తరగతుల్లో ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన 33 మంది ఎస్సీ, ఎస్టీ మహిళా...