Bharat Aawaz
బొబ్బిలిలో తప్పిన ప్రాణాపాయం
బొబ్బిలి పట్టణంలోని టిఆర్ కాలనీ వైఎస్సార్ విగ్రహం సమీపంలో విద్యుత్ వైర్ తెగి మహిళపై పడడంతో ఆమె షాక్కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు కర్రలతో వైరు తొలగించి పెద్ద ప్రమదాన్ని తప్పించారు. క్షతగాత్రురాలిని 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటికే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తెగిన వైర్ను వెంటనే సరిచేయాలని అధికారులు కోరుతున్నారు. #RAJESH 
130 Views