మదనపల్లె: మదనపల్లె మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు ఆదివారం నామినేషన్లు దాఖలు చేశారు. రెండో వార్డు అభ్యర్థిగా వి. సుధా మహేశ్వరి, ఐదో వార్డు అభ్యర్థిగా చామంచుల మల్లిక, మొదటి వార్డు అభ్యర్థిగా పి. శివ శంకర నామినేషన్ పత్రాలను సమర్పించారు. జనసేన పార్టీ మహిళా నాయకురాలు దారం అనిత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ.. వార్డుల అభివృద్ధికి కృషి చేయడంతో పాటు...