మదనపల్లె: ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలాన్ని పక్కనే ఉన్న వ్యక్తి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని గుర్రంకొండ మండలం సెట్టివారిపల్లె పంచాయతీకి చెందిన టీ. గంగులమ్మ, నరసింహులు దంపతులు ఆరోపించారు. శుక్రవారం మదనపల్లె ప్రెస్ క్లబ్‌లో తమ సమస్యను మీడియా దృష్టికి తీసుకొచ్చి న్యాయం చేయాలని కోరారు. 2004లో అప్పటి ప్రభుత్వం తరఫున తమకు సర్వే నంబర్ 380 పరిధిలో నాలుగున్నర సెంట్ల ఇంటి స్థలానికి పట్టాలు...