విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన శుక్రవారం, అమ్మవారి జన్మనక్షత్రమైన ‘మూలా నక్షత్రం’ కావడంతో కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ పవిత్రమైన రోజున అమ్మవారు జ్ఞాన ప్రదాయిని అయిన శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఇంద్రకీలాద్రి...