శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలో రెండు రోజులపాటు నిర్వహించిన సింగరేణి కంపెనీ స్థాయి షటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ పోటీలు ఘనంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ, సమన్వయం, టీమ్‌వర్క్‌ను పెంపొందిస్తాయని తెలిపారు....