Bharat Aawaz
ఇంద్రకీలాద్రిపై మహాచండిగా కనకదుర్గ.. నేడు అమ్మవారి దర్శనానికి రాష్ట్రపతి.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన బుధవారం కనకదుర్గమ్మ వారు 'శ్రీ మహాచండి దేవి' అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ విశేష రూపంలో కొలువై ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ఇంద్రకీలాద్రికి విచ్చేయనున్నారు. మహాచండి దేవి దర్శనార్థం బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో...
111 Views