వైసీపీ మద్దతుదారులకు ఒకటే చెబుతున్నాం. మేం అభివృద్ధిని రాజకీయాలకు అతీతంగా చూస్తున్నాం. ఏ పార్టీ బతకాలనేది కాదు, వ్యవస్థలు బతకాలి, గ్రామాలు బాగుపడాలి, ప్రజల జీవితాలు మెరుగుపడాలి. పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత, వైసీపీ మద్దతు ఉన్న పంచాయతీలకు కూడా అవసరమైన నిధులు అందేలా చర్యలు తీసుకున్నాను" అని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాజకీయాలతో సంబంధం లేకుండా...