ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కాసేపటి క్రితం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని కీలక జల ప్రాజెక్టుల పురోగతిని, నిధుల అవసరాన్ని ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. ముఖ్యంగా పోలవరం, జల్ జీవన్ మిషన్‌కు సంబంధించిన అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు.
రాష్ట్రంలో రూ.30,000 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 'జల్ జీవన్ మిషన్ -...