రాయచోట లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాయచోటి రూరల్ మండల అధ్యక్షులు గండికోట సుధాకర్ మాట్లాడుతూ రాయచోటి వైసిపి నాయకుడు ఏకగ్రీవాల గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు చదివినంత అందంగా ఉందని ఎద్దేవా చేశారు. రాయచోటిలో వైసీపీ నాయకుడు గత రెండు రోజుల ముందు మీడియా సమావేశంలో రాజు మంచివాడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని తెలపడం ఎంతవరకు సమంజసం అని, ప్రపంచం మొత్తం ఎల్ ని నో ప్రభావంతో వర్షాలు పడక కరువుతో...