ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని పాలనా వ్యవహారాల్లో జాప్యాన్ని నివారించేందుకు, ఫైళ్ల క్లియరెన్స్‌ను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. శాఖలోని ఏ స్థాయిలోనైనా ఫైలు పరిశీలన రెండు రోజులకు మించి నిలిచిపోకూడదని, అలాగే ఏ రకమైన వినతి లేదా అంశంపైనైనా గరిష్ఠంగా 15 రోజుల్లో పూర్తి స్థాయి నిర్ణయం తీసుకునేలా స్పష్టమైన మార్పు తేవాలని...