కార్యకర్తలే నా బలం.. బాధపడి ఉంటే క్షమించండి: ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి!
అడ్డతీగలలో గతంలో జరిగిన సమావేశంలో తాను మాట్లాడిన మాటల్లోని కొన్ని భాగాలు మాత్రమే సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలోకి వచ్చాయని రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి తెలిపారు. శుక్రవారం రాజవొమ్మంగి మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ విషయంపై వివరణ ఇచ్చారు. సమావేశంలో తాను మాట్లాడిన పూర్తి విషయాన్ని కాకుండా, కొన్ని మాటలను మాత్రమే విడిగా తీసుకుని ప్రచారం చేయడం వల్ల తన మాటల అసలు ఉద్దేశం వేరుగా...