“ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలన్న సూత్రం... ఆమెను చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది.”
చిన్ననాటి నుంచే తల్లి వాసవి గుత్తా కోరిక మేరకు నాగదుర్గ కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందారు. నృత్యమే తన ప్రపంచంగా భావించిన ఆమె... ఒక్కో మెట్టు ఎక్కుతూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.
వేదికపై శాస్త్రీయ నృత్యం చేస్తే హుందాతనం...
తెలంగాణ జానపద గీతానికి అడుగేస్తే పల్లె పరిమళం...
కెమెరా ముందుకొస్తే నటిగా మరో కొత్త రూపం...
ఇలా ఒకే కళాకారిణిలో ఎన్నో కోణాలను...