ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం అమలుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా హక్కు చట్టం-2009 ప్రకారం ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం సీట్లను నిరుపేద విద్యార్థులకు ఉచితంగా కేటాయించాల్సి ఉండగా, ఈ విధానంలో ఉన్న మార్గదర్శకాలను సవరించి, పటిష్ఠంగా అమలు చేసేందుకు ఒక రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఈ...